• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CENTRAL GOVERNMENT ALLOTTED RS 9000 CRORES TO ANDHRA PRADESH UNDER PMAY URBAN HOUSING SCHEME AND UNION MINISTER ANSWERED TO MP PARIMAL NATHWANI QUESTION PRN GNT

PMAY: పీఎంఏవై (అర్బన్) కింద ఏపీకి రూ.9వేల కోట్లు.. ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు కేంద్రం సమాధానం

PMAY: పీఎంఏవై (అర్బన్) కింద ఏపీకి రూ.9వేల కోట్లు.. ఎంపీ పరిమళ్ నత్వానీ  ప్రశ్నకు కేంద్రం సమాధానం

రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి రూ.30,731 కోట్లు సహా మొత్తం కేంద్ర సాయం రూ.1,78,076 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటన లో పేర్కొన్నారు.

  • Share this:
    ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం రూ.9,311 కోట్ల కేంద్ర సాయాన్ని విడుదల చేసింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు దేశంలో 1 కోటీ 10 లక్షల ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 20,28,899 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. పార్లమెంటు సభ్యుడు పరిమళ్ నాథ్వానీ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ..,  రాజ్యసభలో గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.30,731 కోట్లు సహా మొత్తం కేంద్ర సాయం రూ.1,78,076 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటన లో పేర్కొన్నారు. PMAY-U కింద 1 కోటీ 12 లక్షల ఇళ్లకు గానూ ఇప్పటి వరకు 1 కోటీ 10 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. వీటిలో 74.8 లక్షల ఇళ్లు, 43.3 లక్షల పూర్తయిన ఇళ్ల నిర్మాణానికి గ్రౌండ్ చేయబడ్డాయి.

    భారతదేశంలో మరిముఖ్యంగా ఎపిలో ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద సబ్సిడీ పొందిన వారి సంఖ్య గురించి తెలుసుకోవాలని పరిమళ్ నత్వానీ కోరారు. పిఎంఎఎ(యు) కింద సబ్సిడీ కొరకు ఎంత మొత్తం ఖర్చు అయిందనే విషయంతో పాటు.. మిషన్ ఎంత శాతం మేరకు పూర్తి చేసింది.. మిషన్ అమలు లో ఎదురయ్యే అడ్డంకులు మరియు ఆ అడ్డంకులను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రశ్నలు సంధించారు.

    ఈ మేరకు స్థానిక సంస్థల నిర్మాణ పనుల గురంచి కూడా కేంద్ర మంత్రి హర్ దిప్ సింగ్ పూరి ప్రకటన చేశారు. భవన నిర్మాణ ప్రణాళిక/లేఅవుట్, పర్యావరణ అనుమతులు, తీర ప్రాంత ఆంక్షలు, రక్షణ అనుమతులు, లబ్ధిదారుల ద్వారా నిధుల కేటాయింపు, టెండరింగ్ ప్రక్రియ, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభానికి ముందు అప్రోచ్ రోడ్లు, నిర్మాణ సామగ్రి లభ్యత, వరదలు, నీటి ఎద్దడి, ఎడతెరిపి లేని వర్షం, తీవ్రమైన చలి/వేడి వాతావరణం వంటి మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ వనరులతో పాటు, జాతీయ అర్బన్ హౌసింగ్ ఫండ్ (ఎన్ యూహెచ్ ఎఫ్) రూ .0,000 కోట్లతో అదనపు బడ్జెటరీ రిసోర్సెస్ (ఈబీఆర్)ను దశలవారీగా ఈ పథకం అమలు కోసం ఏర్పాటు చేసినట్లు మంత్రి ప్రకటించారు.

    అన్నింటిని మించి, సరసమైన హౌసింగ్ సెగ్మెంట్ లో హౌసింగ్ రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడం కొరకు బ్యాంకులు/ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ ల్లో ప్రాధాన్యతా రంగ రుణ కొరతను ఉపయోగించి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్.హెచ్.బి)లో రూ 10,000 కోట్ల కార్పస్ తో 'సరసమైన హౌసింగ్ ఫండ్' (ఎహెచ్ ఎఫ్) సృష్టించడం జరిందిని.. అలాగే 2019-20లో మరో రూ.10 వేల కోట్లు కేటాయింపు జరిగిందని మంత్రి ప్రకటన ద్వారా తెలిపారు.

    కేంద్ర మంత్రి ప్రకటన ప్రకారం లబ్ధిదారుల ఆధార్ ధ్రువీకరణ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) విధానం ద్వారా నిధుల బదిలీ, ప్రాజెక్టుల జియో ట్యాగింగ్, సోషల్ ఆడిట్, థర్డ్ పార్టీ క్వాలిటీ మానిటరింగ్, పటిష్టమైన కేంద్రీకృత మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎమ్ఐఎస్) మరియు సిఎల్ఎస్ఎస్ అవాస్ పోర్టల్ (CLAP) మరియు CLSS ట్రాకర్ వంటి టూల్స్ పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ధృవీకరించడానికి అందించినట్లు వివరించారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు