• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CENTRAL ELECTION COMMISSION RELEASED SCHEDULE FOR MLC ELECTIONS BY MLAS IN ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... పోలింగ్ ఎప్పుడంటే...

Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... పోలింగ్ ఎప్పుడంటే...

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో ఎన్నికల నగరా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections) కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల నగరా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఖాళీ అయిన ఆరు స్థానాలకు ఈనెల 25న నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిపింది. మార్చి 4వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, మార్చి 5న నామినేషన్ల పరిశీల, మార్చి 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు గడువు ఇచ్చింది. మార్చి 15న పోలింగ్ అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఖాళీ అయిన స్థానాల విషయానికి వస్తే రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం ఖాళీ అయింది. అలాగే చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది.

    ఇక  ప్రస్తుతం పదవుల్లో ఉన్న  ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్, తిప్పేస్వామి, సుధారాణి, వీర వెంకన్న చౌదరిల పదవీ కాలం  ఈ నెల 29తో ముగియనుంది. దీంతో మొత్తం 6 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

    ఇదీ షెడ్యూల్

    • ఫిబ్రవరి 25న నోటిఫికేషన్.. మార్చి 15న పోలింగ్

    • మార్చి4: నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు

    • మార్చి 5: నామినేషన్ల పరిశీలన

    • మార్చి 8: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

    • మార్చి 15: పోలింగ్ ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు పోలింగ్‌

    • మార్చి 15 సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాల ప్రకటన

    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు