Home /News /politics /

CENTRAL CABINET RESHUFFLE 43 MINISTERS TO TAKE OATH TODAY HERE IS THE LIST AK

Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్ విస్తరణ.. ప్రమాణం చేయబోయే 43 మంది వీరే..

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా (ఫైల్ ఫోటో)

Cabinet Reshuffle: కొందరు మంత్రులు కేబినెట్‌ నుంచి తప్పుకోగా.. మరికొందరు మంత్రులకు విస్తరణ సందర్భంగా ప్రమోషన్ లభించనుంది.

    మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసిన ప్రధాని మోదీ, బీజేపీ ముఖ్యనేతలు.. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్‌లో చోటు కల్పించాలని నిర్ణయించారు. కొందరు మంత్రులు కేబినెట్‌ నుంచి తప్పుకోగా.. మరికొందరు మంత్రులకు విస్తరణ సందర్భంగా ప్రమోషన్ లభించనుంది. ప్రస్తుతం కేబినెట్‌లో సహాయమంత్రులుగా కొనసాగుతున్నకిరణ్ రిజుజు, కిషన్ రెడ్డి, హర్ దీప్ సింగ్ పూరి, అనురాగ్ ఠాగూర్ వంటి వారికి ప్రమోషన్ లభించనుంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ రాజీనామా చేశారు. ఆ వెంటనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. దీంతో మొత్తంగా ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. 22 మంది కొత్త వారికి ఈసారి మంత్రులుగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.



    1. నారాయణ్ రాణె
    2. సర్బానంద సోనోవాల్
    3. వీరేంద్ర కుమార్
    4. జ్యోతిరాధిత్య సింధియా
    5. రామచంద్ర ప్రసాద్ సింగ్
    6. అశ్వినీ వైష్ణవ్
    7. పశుపతి కుమార్ పరాస్
    8. కిరణ్ రిజుజు
    9. రాజ్ కుమార్ సింగ్
    10. హర్‌దీప్ సింగ్ పూరి
    11. మన్సుఖ్ మండవియా
    12. భూపేంద్ర యాదవ్
    13. పురుషోత్తం రూపాలా
    14. కిషన్ రెడ్డి
    15. అనురాగ్ ఠాకూర్
    16. పంకజ్ చౌదరి
    17. అనుప్రియ సింగ్ పటేల్
    18. సత్యపాల్ సింగ్ భగేల్
    19. రాజీవ్ చంద్రశేఖర్
    20. శోభా కరంద్లాజె
    21. భాను ప్రతాప్ సింగ్ వర్మ
    22. దర్శన విక్రమ్ జర్దోష్
    23. మీనాక్షి లేఖి
    24. అన్నపూర్ణ దేవి
    25. నారాయణస్వామి
    26. కౌశల్ కిశోర్
    27. అజయ్ భట్
    28. బీఎల్ వర్మ
    29. అజయ్ కుమార్
    30. చౌహాన్ దేవుశిష్
    31. భగవంత్ కుబా
    32. కపిల్ మోరేశ్వర్ పాటిల్
    33. సుశ్రి ప్రతిమా భౌమిక్
    34. సుభాష్ సర్కార్
    35. భగవత్ కిషన్ రావు కరాడ్
    36. రాజ్‌కుమార్ రంజన్ సింగ్
    37. భారతి ప్రవీణ్ పవార్
    38. బిశ్వేశ్వర్ టుడా
    39. శంతను ఠాగూర్
    40. ముంజపర మహేంద్ర భాయ్
    41. జాన్ బార్లా
    42. ఎల్ మురుగన్
    43. నిషిత్ ప్రమాణిక్



    మోదీ కొత్త టీమ్‌లో యువ నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మహిళలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు పెద్ద పీట వేసినట్లు సమాచారం. బీసీలకు 27, ఎస్టీలకు 17, ఎస్టీకి 7 మంత్రి పదవులు కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇద్దరు బుద్దిస్ట్‌లు, ఒక ముస్లిం, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్‌కు కలిపి మొత్తం 5 మంత్రి పదవులను మైనారిటీలకు కేటాయించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Cabinet Reshuffle, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు