నర్సాపురం వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు ఇంట్లో సీబీఐ సోదాలు

రఘురామ కృష్ణం రాజు (ఫైల్)

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, వాటిని తిరిగి చెల్లించడంలో రఘురామకృష్ణంరాజు కంపెనీలు విఫలమయ్యాయని గతంలో ఫిర్యాదులు వచ్చాయి.

  • Share this:
    పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు ఇంట్లో సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు. ఈ రోజు ఉదయం నుంచి ఎమ్మార్‌లో ఉన్న ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో గతంలోనే కేసు నమోదు చేసిన అధికారులు.. విచారణలో భాగంగా సోదాలు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, వాటిని తిరిగి చెల్లించడంలో రఘురామకృష్ణంరాజు కంపెనీలు విఫలమయ్యాయని గతంలో ఫిర్యాదులు వచ్చాయి. బెంగళూరు నుంచి వచ్చిన పలువురు అధికారులు ప్రస్తుతం ఆయన ఇంట్లో దాడులు జరుపుతున్నారు. అటు పశ్చిమగోదావరిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, సీబీఐ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి రఘురామ కృష్ణంరాజుతో పాటు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్, టీడీపీ నుంచి శివరామరాజు, జనసేన నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు బరిలో ఉన్నారు. ఇక్కడి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రీపోలింగ్ నిర్వహించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
    First published: