పవన్ కళ్యాణ్‌కు షాక్... జనసేనకు లక్ష్మీనారాయణ గుడ్ బై

లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్

జనసేనకు ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పారు.

 • Share this:
  పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా పార్టీ తీరు, పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న లక్ష్మీనారాయణ... ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ప్రజా సేవ కోసం తాను నటనకు పూర్తిగా స్వస్తి చెబుతానని గతంలో అనేకసార్లు పవన్ కళ్యాణ్ చెప్పారని... కానీ ఆయన మళ్లీ నటించాలని నిర్ణయించుకోవడం సరికాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్‌లో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్టు లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

  లక్ష్మీనారాయణ రాజీనామా లేఖ


  ఏపీలో ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లక్ష్మీనారాయణ మధ్య విభేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఆయన ఖండించారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేశారు. అయితే ఇటీవల బీజేపీతో జనసేన పొత్తు సహా పలు కీలక అంశాలపై పార్టీ తనను సంప్రదించకపోవడంపై లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో జనసేన తరువాత విశాఖ లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్ష్మీనారాయణ... ఆ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.
  Published by:Kishore Akkaladevi
  First published: