CBI COURT HEARING ON AP CM JAGAN BAIL PETITION ADJOURNED TO AUGUST 25TH NGS
Jagan Bail Petition: సీఎం జగన్ బెయిల్ రద్దు.. కోర్టు విచక్షణ అధికారాలదే నిర్ణయమన్న సీబీఐ.. తుది తీర్పు ఎప్పుడంటే..?
ప్రధానికి రఘురామ లేఖ
ఏపీ సీఎం జగన్ బెయిల్ పిటిషన్ విచారణ ఉత్కంఠ పెంచుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఎలాంటి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వలేదు.. కోర్టు విచక్షణకే అధికారులు వదిలేస్తున్నామన్నారు. దీంతో ఇక తుది తీర్పు చెప్పేందుకు కోర్టు సిద్ధమైంది. మరి తీర్పు ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా..? కొనసాగుతుందా..? ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణపై రోజు రోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. సుప్రీం కోర్టు దీనిపై ఏం చెబుతుందని అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. పిటిషనర్ వాధనతో ఏకిభవించి బెయిల్ రద్దు చేస్తే ఏపీలో పరిస్థితి ఏంటి. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బెయిర్ రద్దు సాధ్యం కాదని కొందరు అంటున్నారు. మరి ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. అయితే పదే పదే విచారణ వాయిదా పడుతుండడంతో ఈ ఉత్కంఠ ఇంకాస్త పెరుగుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేసుకు సంబంధించి ఇవాళ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు విచక్షణ అధికారాలకే నిర్ణయం వదిలేసామంటూ దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టును సీబీఐ కోరింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు. వేర్వేరుగా ఎవరి వాదన వారు వినిపించారు. ఈ మూడింటినీ సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకొని..
ఇప్పటి వరకు జరిగిన విచారణను పరిశీలిస్తే.. సీబీఐ పెద్దగా దీనిపై ఎలాంటి వాదన వినిపించేందుకు ఇష్టపడలేదు. ఇటే జగన్ తరపు లాయర్లు మాత్రం ఆయనపై కుట్రపూరితంగా పిటిషన్ వేశారంటూ వాదించారు. అటు ఎంపీ రఘురామ తరుపున న్యాయవాదులు మాత్రం.. కచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని గట్టిగానే వాదించారు. మరోవైపు జగన్‌పై ఉన్న కేసుల్లో సాక్షులు, నిందితులుగా ఉన్న అధికారులు ప్రస్తుతం ఏపీలో మంచి హోదాలో పని చేస్తున్నారని వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏపీ సీఎం ప్రభావితం చేసే అవకాశం ఉందని లిఖిత పూర్వక వాదనల్లో పిటిషనర్ తెలిపారు. గతంలో ఐఏఎస్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ను ఏపీ సీఎం వేధింపులకు గురిచేశాడని.. అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయన్నారు.
గత విచారణ సమమంలో తప్పకుండా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సిందే అంటూ కోర్టు సీబీఐ అధికారులు గట్టిగానే చెప్పింది. దీంతో తాజాగా కోర్టు విచాక్షణాధికారానికే వదిలిస్తున్నామని సీబీఐ అధికారులు చెప్పడంతో.. విచారణను సీబీఐ కోర్టు ఆగష్టు 25కు వాయిదా వేసింది. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆగష్టు 25న కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.