జగన్‌కు సీబీఐ కోర్టు షాక్... సుప్రీంకు వెళ్లాలంటూ సలహా

సీఎం జగన్

అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్న జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం ఆర్టికల్ 14కు విరుద్ధమని తెలిపింది.

  • Share this:
    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసు విచారణలో సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలంటే... సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఏపీ సీఎం జగన్‌కు స్పష్టం చేసింది. నిందితుల హోదా మారినంత మాత్రాన కేసుల తీవ్రత తగ్గినట్లు కాదని పేర్కొంది. జగన్ పిటిషన్ కొట్టివేస్తూ హైదరాబాద్ లోని కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రతి సోమవారం బయటకు వచ్చింది. 2013లో జగన్ వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను సీబీఐ కోర్టు తన ఆదేశాలలో తెలిపింది.

    ‘ఆర్థిక నేరాల వెనుక పెద్ద కుట్ర ఉంటుంది. వీటివల్ల పెద్ద ఎత్తున ప్రజాధనం నష్టపోవాల్సి వస్తేంది. ఇలాంటి నేరాల వల్ల దేశ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది ’అని సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేసింది. జగన్ తరపున న్యాయవాది హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను గతంలో కోట్టివేశామని ఈ ఆదేశాల్ని హైకోర్టు కూడా సమర్థించిందని పేర్కొంది. పదవిలో ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరునకు మినహాయింపు కోరడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధం. నిందితుల హోదా, ఆర్థిక నేపథ్యం ఆధారంగా వ్యక్తిగత హాజరునకు మినహాయింపు సరికాదు. అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్న జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం ఆర్టికల్ 14కు విరుద్ధమని తెలిపింది. అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్న జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్షులు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది సురేందర్ రావు వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.కావాలంటే ఈవిషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలంటూ సలహా కూడా ఇచ్చింది.
    First published: