జగన్‌కు గుడ్ న్యూస్.. అందుకు ఓకే చెప్పిన సీబీఐ కోర్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది.

news18-telugu
Updated: September 20, 2019, 4:35 PM IST
జగన్‌కు గుడ్ న్యూస్.. అందుకు ఓకే చెప్పిన సీబీఐ కోర్టు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి
news18-telugu
Updated: September 20, 2019, 4:35 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు కుదరదంటూ హైకోర్టు కొట్టివేసింది. అయితే, ఇప్పుడు ఎందుకు పిటిషన్‌ను తాము అనుమతించాలని సీబీఐ కోర్టు జగన్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. అయితే, అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు వేరని, మారిన సందర్భాలను బట్టి విచారణ చేపట్టవచ్చని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. వారి వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు జగన్ పిటిషన్‌ను విచారించేందుకు ఓకే చెప్పింది.

2011 నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన కోర్టుకు హాజరయ్యారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడం కుదరదని, ప్రోటోకాల్ అంశాలు, భద్రతా పరమైన అంశాల వల్ల సాధ్యం కాదని, కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అసలే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున, ప్రతివారం ముఖ్యమంత్రి హైదరాబాద్ రాకపోకలు సాగిస్తే, దీని వల్ల రాష్ట్రంపై భారం పడుతుందని పిటిషన్‌లో వాదించారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరారు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...