టీకాంగ్రెస్ నేత కారులో రూ.48 లక్షలు... సీజ్ చేసిన పోలీసులు

నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి జూబ్లిహిల్స్ నుంచి నల్గొండకు డబ్బును ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 3, 2019, 4:37 PM IST
టీకాంగ్రెస్ నేత కారులో రూ.48 లక్షలు... సీజ్ చేసిన పోలీసులు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో )
  • Share this:
ఎన్నికల వేళ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాక్ తగిలింది. ఉత్తమ్‌కు సంబంధించిన కారులో రూ.48 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం కోసమే ఈ డబ్బును తరలిస్తున్నట్లు సమాచారం.నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి జూబ్లిహిల్స్ నుంచి నల్గొండకు డబ్బును ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద తనిఖీలు చేసిన పోలీసులు కారులో తరలిస్తున్న డబ్బును సీజ్ చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఉత్తమ్ కానీ.. పార్టీ వార్గాలు కాని స్పందించలేదు. అయితే డబ్బులు ఎక్కడ డ్రా చేశారు. దేని కోసం ఇంత మొత్తాన్ని తీసుకెళ్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.First published: April 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు