‘ఎక్కడెక్కడ చూశారు’అంటూ నోరుజారిన జయప్రద... ఈసీ సీరియస్ కేసు నమోదు

ఈనెల 18వ ఎన్నికల ప్రచారం సందర్భంగా జయప్రద చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. దీంతో ఈసీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

news18-telugu
Updated: April 22, 2019, 11:42 AM IST
‘ఎక్కడెక్కడ చూశారు’అంటూ నోరుజారిన జయప్రద... ఈసీ సీరియస్ కేసు నమోదు
ఆజంఖాన్, జయప్రద
  • Share this:
ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆజాంఖాన్ వ్యాఖ్యలతో తీవ్ర ఆవేదనకు గురైన జయప్రద... నోరుపారేసుకున్నారు.యూపీల బీఎస్పీ-ఎస్పీ పొత్తు నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆజంఖాన్‌ను ఉద్దేశిస్తూ ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న జయప్రద... అక్కడ ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాంపూర్ ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ లపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాయావతిపై ఆజంఖాన్ ఎక్స్ రే కళ్లు వేసి ఎక్కడెక్కడ చూశారంటూ జయప్రద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈనెల 18వ ఎన్నికల ప్రచారం సందర్భంగా జయప్రద చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. దీంతో ఈసీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతకుముందు ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాయావతి, ఆజాంఖాన్‌పై ఈసీ యాక్షన్ తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ 72 గంటలు, మాయావతి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ కీలక నేత ఆజంఖాన్, కేంద్రమంత్రి మేనకా గాంధీపైనా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆజం ఖాన్‌ ప్రచారంపై 72 గంటలు, మేనకా గాంధీ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధాజ్ఞలు విధించారు.రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆజంఖాన్ ఇటీవలకాలంలో నోరుపారేసుకుంటున్నారు. అదే ప్రాంతం నుంచి బీజేపీ తరపున పోటీకి దిగుతున్న జయప్రదపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

First published: April 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>