ప్రగతి భవన్ ముట్టడి ఎఫెక్ట్.. రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు గాను రేవంత్ రెడ్డిపై 341,332,353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: October 23, 2019, 2:04 PM IST
ప్రగతి భవన్ ముట్టడి ఎఫెక్ట్.. రేవంత్ రెడ్డిపై కేసు నమోదు
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 23, 2019, 2:04 PM IST
మల్కాజ్‌గిరి ఎంపీ,తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన ఆయన.. పోలీసు విధులకు ఆటంకం కలిగించి,విధి నిర్వహణలో ఉన్న అధికారిని తోసేసి దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో కేసు నమోదైంది.సోమవారం ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నం.48లోని రేవంత్ నివాసంలో పోలీసులు ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మధ్యాహ్నం 12గంటల సమయంలో పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి రేవంత్ ఇంటి నుంచి బయటకు దూసుకొచ్చారు. ఆ సమయంలో ఎస్ఐ నవీన్ రెడ్డి రేవంత్‌ని అడ్డుకోగా.. ఆయన్ను తీసుకుంటూ వెళ్లిపోయారు.

అప్పటికే సిద్దంగా ఉనన బైక్‌పై ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లారు. వెనకాలే వెళ్లిన పోలీసులు చాలా దూరం ఆయన్ను చేజ్ చేసుకుంటూ వెళ్లినప్పటికీ.. రేవంత్ ప్రగతి భవన్‌కు చేరుకోగలిగారు. ఈ ఘటనలో ఎస్ఐ నవీన్ రెడ్డికి గాయాలయ్యాయి. మిగతా పోలీసులను కూడా రేవంత్ నెట్టుకుంటూ వెళ్లడంతో వారికి కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు గాను రేవంత్ రెడ్డిపై 341,332,353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.


First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...