టీడీపీకి షాక్... మంగళగిరిలో నన్నపనేనిపై కేసు నమోదు

నన్నపనేని రాజకుమారి మరియు సత్యవాణి అనే మరో మహిళపై ఐపీసీలో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

news18-telugu
Updated: September 12, 2019, 3:53 PM IST
టీడీపీకి షాక్... మంగళగిరిలో నన్నపనేనిపై కేసు నమోదు
నన్నపనేని రాజకుమారి(imge:ఫేస్ బుక్)
  • Share this:
మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పై కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై అనురాధ మరియు సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషణ, విధులకు ఆటంకం కలిగించి నందువల్ల ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నన్నపనేని రాజకుమారి మరియు సత్యవాణి అనే మరో మహిళపై ఐపీసీలో 353, 506, 509 r/w 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పోలీసులకు లేడీ ఎస్ఐ అనురాధ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

బుధవారం ఛలో ఆత్మకూరు సందర్భంగా టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నన్నపనేని నోరు పారేసుకున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో కలత చెందిన ఎస్‌ఐ అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని అలా మాట్లాడడం సరికాదని అన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎస్ఐ అనురాధ అన్నారు.

మరోవైపు ఐపీఎస్‌ అధికారి విక్రాంత్‌ పాఠిల్‌పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నోటి దురుసు చూపించారు. దీంతో అచ్చెన్నాయుడుపై ఎస్‌ఐ కోటయ్య ఫిర‍్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వైఎస్సార్‌ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఆయనపై కేసు నమోదైంది.First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు