జయప్రదపై ఆజంఖాన్ ‘ఖాకీ నిక్కర్’వ్యాఖ్యలు... రాంపూర్‌లో కేసు నమోదు

జయప్రదపై ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఆజంఖాన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: April 15, 2019, 10:38 AM IST
జయప్రదపై ఆజంఖాన్ ‘ఖాకీ నిక్కర్’వ్యాఖ్యలు... రాంపూర్‌లో కేసు నమోదు
ఆజంఖాన్, జయప్రద
news18-telugu
Updated: April 15, 2019, 10:38 AM IST
యూపీలో ఎన్నికల వేడి మరింత రాజుకుంటుంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి జయప్రద, ఎస్పీ ఎంపీ అభ్యర్థి ఆజంఖాన్ మధ్య మాటల చిచ్చు రగులుతోంది. తాజాగా ఆజంఖాన్..మరోసారి జయప్రదపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయప్రదను తానే రాంపూర్‌కు తీసుకువచ్చానన్నారు. ఆమె శరీరాన్ని ఎవరూ తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నానంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆజం ఖాన్ వ్యాఖ్యలపై కలకలం రేగింది. జయప్రదను తానెలా కాపాడానో ప్రజలకు తెలుసన్నారు ఆజంఖాన్. ఆమె నిజ స్వరూపం తెలుసుకునేందుకు ఓటర్లకు 17 ఏళ్లు పట్టిందన్నారాయన.ఆమె ఇప్పుడు ఖాకీ నిక్కర్ వేసుకుందని విమర్శలు చేశారు.

తాజాగా జయప్రదపై ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఆజంఖాన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. ఆయన మాటలు అవమానకరమైనవన్నారు. దీంతో ఆజంఖాన్‌కు నోటీసులు కూడా పంపారు. దీంతో పాటు ఈసీతో కలిసి ఆజంఖాన్‌ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరుతామన్నారు. మరోవైపు దీనిపై పోలీసులు స్పందించారు. ఆజాంఖాన్‌పై రాంపూర్‌లో కేసు నమోదయ్యింది.

ఆజంఖాన్‌కు నోటీసులు పంపిన మహిళా కమిషన్


తాజాగా ఆజాంఖాన్‌ను అన్నా అని పిలిచినా... ఆయన తనను డాన్సర్ అన్నారంటూ జయప్రద వ్యాఖ్యలు చేశారు. జయప్రదకు కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఆజంఖాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా ఎన్నికల వేళ ఈ ఇద్దరు నేతలు దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు.

First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...