మాజీ స్పీకర్ కోడెలకు మరో షాక్... కూతురిపై కేసు నమోదు

పద్మావతి అనే మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు విజయలక్ష్మితో పాటు ఆమె అనుచరులపై కేసు నమోదు చేశారు.

news18-telugu
Updated: June 10, 2019, 11:13 AM IST
మాజీ స్పీకర్ కోడెలకు మరో షాక్... కూతురిపై కేసు నమోదు
స్పీకర్ కోడెల శివప్రసాద రావు
  • Share this:
మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌‌కు మరో షాక్ తగిలింది. ఆయన కూతురు విజయలక్ష్మిపై కూడా కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం కేసానుపల్లిలో భూకబ్జా చేసి రూ. 14 లక్షలు వసూలు చేశారని పద్మావతి అనే మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు విజయలక్ష్మితో పాటు ఆమె అనుచరులపై కేసు నమోదు చేశారు. విజయలక్ష్మీతో పాటు మరో ఇద్దరిపై కేసు ఫైల్ అయ్యింద. ఎకరం భూమిని కొట్టేసేందుకు కోడెల కూతురు విజయలక్ష్మి యత్నించారని, నకిలీ రికార్డులతో బెదిరింపులకు దిగారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. చివరికి విజయలక్ష్మి రూ.14 లక్షలు వసూలు చేశారని ఆరోపించింది. తాజాగా మరో రూ.5లక్షలు కావాలంటూ బెదిరించారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విజయలక్ష్మీతో పాటు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతకుముందు కోడెల కుమారుడు శివరామకృష్ణపై కూడా కేసు నమోదైంది. 2014లో కోడెల గెలుపుతో కుమారుడు శివరామకృష్ణ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతడు ప్రజలు పట్టి పీడించాడని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జీఎస్టీ బదులు కేఎస్టీ కూడా వసూలు చేస్తున్నారని శివరామకృష్ణపై ఆరోపణలున్నాయి. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో కూడా జనం జగన్ వద్ద ఇదే విషయాన్ని మొరపెట్టుకున్నారు. అంతే కాకుండా గుంటూరు జిల్లాలో కేబుల్ బిజినెస్‌లో కూడా శివ రామకృష్ణ.. పలువురు వ్యాపారులను మోసం చేసి మరీ రూ.70 కోట్లకు పైగా వెనుకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పలు కంపెనీలు కోడెల శివారంపై ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఆదివారం రాత్రి నుండి కోడెల శివరాంకి సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, గుంటూరులోని ఆయనకు సంబంధించిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

ఏపీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేతగా కోడెల శివప్రసాద్‌కు మంచి గుర్తింపు ఉంది. దీంతో తన తండ్రి పేరును కూతురు విజయలక్ష్మీ, కుమారుడు ఎడపెడ వాడుకున్నారు. అధికార దర్పాన్ని ప్రదర్శించి అందినకాడికి దోచుకున్నారు. వీరి హయాంలో జరిగిన దోపిడిని అప్పటి విపక్ష వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు ఏపీలో అధికారం వైసీపీ చేతికి రావడంతో కోడెల బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కోడెల కుటుంబ అరాచకాల్ని బయటపెడుతున్నారు. అయితే వీటిపై కోడెల కుటుంబసభ్యులు మాత్రం మాట్లాడేందుకు నిరాకరించినట్లు సమాచారం.First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు