ఓ నిందితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో చిదంబరం అరెస్టు.. కాంగ్రెస్ ఆగ్రహం..

Chidambaram | INX Media Scam | పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ఓ నిందితురాలు చెప్పిన ఆధారాలతో చిదంబరాన్ని అరెస్టు చేశారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 22, 2019, 12:36 PM IST
ఓ నిందితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో చిదంబరం అరెస్టు.. కాంగ్రెస్ ఆగ్రహం..
రణదీప్ సూర్జేవాలా(File)
  • Share this:
కన్న కూతుర్ని చంపిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఓ మహిళ ఇచ్చిన వాంగ్మూలంతో చిదంబరాన్ని అరెస్టు చేశారని అని కాంగ్రెస్ పార్టీ సీబీఐ‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ఓ నిందితురాలు చెప్పిన ఆధారాలతో చిదంబరాన్ని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ఐఎన్‌ఎక్స్‌ అధినేత ఇంద్రాణీ ముఖర్జీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వివరాల్లోకెళితే.. తన కూతురు షీనా బోరా పేరిట భారీ మొత్తంలో సొమ్మును విదేశాల్లో దాచిపెట్టారు ఇంద్రాణీ. పరిస్థితులు కలిసిరాక షీనాను చంపించేశారని ఇంద్రాణీపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకోవడానికి కారణం ఏంటంటే.. ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కాంలో ఇంద్రాణీ, ఆమె రెండో భర్త పీటర్‌ ముఖర్జీ సహ నిందితులు. ఇందులో పీటర్‌ .. చిదంబరం కుమారుడు కార్తీకి వ్యాపార సలహాదారు. ఆ పరిచయంతో ఇంద్రాణీ ఐఎన్‌ఎక్స్‌ కేసులో 26 శాతం వాటా అమ్మకానికి ఎఫ్‌ఐపీబీ అనుమతి కోరారు. కానీ ఎఫ్‌ఐపీబీ తొలుత ఆమె దరఖాస్తును తిరస్కరించింది. చిదంబరం కూడా రూ 4.62 కోట్ల మేర వాటా అమ్మకానికే అనుమతినిచ్చారు.

ఆ సమయంలో కార్తి ఓ బేరం పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఈ డీల్‌ కుదరుస్తానని కార్తీ డిమాండ్ చేసినట్లు, అందుకు పీటర్‌ ఒప్పుకున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్‌ ద్వారా ఎంత మొత్తాన్ని తరలించిందన్నది ఇంద్రాణీ వెల్లడించకపోయినా దాదాపు రూ.300 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. తర్వాత కార్తీని ఇంద్రాణీ ఓ స్టార్‌ హోటల్లో కలిసి రూ 3.5 కోట్ల చెల్లింపుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మొత్తాన్ని కార్తి చిదంబరానికి సింగపూర్‌లో ఉన్న సంస్థ అడ్వాంటేజ్‌ సింగపూర్‌కు బదలాయించింది.

అయితే, ఆ తర్వాత అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ఈ వివరాలన్నింటినీ సీబీఐ దర్యాప్తులో బయటపెట్టేసింది. చిదంబరం పాత్రను, ఆయనతో తన భేటీలను ఆమె సవివరంగా తేదీలతో సహా వివరించారు. దీంతో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అంటే.. చిదంబరాన్ని పట్టించింది ఆమే

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు