HOME »NEWS »POLITICS »cant understand why a respected lady like didi is behaving like saddam hussein says vivek oberoi sk

మమతా బెనర్జీని సద్దాం హుస్సేన్‌తో పోల్చిన బాలీవుడ్ హీరో

మమతా బెనర్జీని సద్దాం హుస్సేన్‌తో పోల్చిన బాలీవుడ్ హీరో
మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య యుద్ధం జరుగుతోంది. అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింసతో హైటెన్షన్ నెలకొంది. కోల్‌కతాలో హింసాత్మక ఘటన జరగడంతో పలువురు బీజేపీ నేతలను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Share this:
    మంగళవారం కోల్‌కతాలో చెలరేగిన హింసపై రాజకీయ దుమారం రేగుతోంది. అమిత్ షా రోడ్ షో సంద్భంగా జరిగిన హింసాత్మక ఘటనపై బీజేపీ, టీఎంసీ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా స్పందించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. అటు బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ సైతం ట్విటర్ వేదికగా మమతపై మండిపడ్డారు. ఆమెను ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్‌తో పోల్చుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    దీదీ వంటి గౌరవప్రదమైన మహిళ సద్దాం హుస్సేన్‌లా ఎందుకు ప్రవర్తిన్నారో నాకు అర్థం కావడం లేదు. దీదీ వంటి నియంతతో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచిఉంది. మొన్న ప్రియాంక శర్మ, ఇప్పుడు తజీందర్ బగ్గ. ఈ దీదీగిరి నడవదు. సేవ్ బెంగాల్. సేవ్ డెమోక్రసీ.
    వివేక్ ఒబెరాయ్, సినీ నటుడు




    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య యుద్ధం జరుగుతోంది. అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింసతో హైటెన్షన్ నెలకొంది. కోల్‌కతాలో హింసాత్మక ఘటన జరగడంతో పలువురు బీజేపీ నేతలను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తజీందర్ బగ్గా సహా పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతకుముందు ప్రియాంక శర్మ విషయంలోనూ ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మమతా బెనర్జీని కించపరిచేలా ఫొటో మార్ఫించ్ చేసినందుకు ఆమెను అరెస్ట్ చేయడంపై దుమారం రేగింది. ఈ క్రమంలోనే మమతా బెనర్జీని విమర్శిస్తూ వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశారు.
    రెండు రోజుల క్రితం మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌పైనా వివేక్ ఒబెరాయ్ విమర్శలు గుప్పించారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టవద్దంటూ ట్విటర్ వేదికగా చురకలంటించారు.


    Published by:Shiva Kumar Addula
    First published:May 15, 2019, 17:39 IST