నేతల్లో పెరుగుతున్న టెన్షన్... మరోసారి సర్వే...

ఎన్నికలు పూర్తయిన రెండు మూడు రోజుల తరువాత మరో సర్వేల ప్రక్రియ ఊపందుకున్నట్టు సమాచారం. సాధారణంగా ఎన్నికలకు ముందు మీరు ఎవరికి ఓటు వేస్తారనే విషయంపై సర్వేలు చేసే సంస్థలు... ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా అభ్యర్థుల కోసం సర్వేలు చేసేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 16, 2019, 4:34 PM IST
నేతల్లో పెరుగుతున్న టెన్షన్... మరోసారి సర్వే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నికలు ముగిసిన తరువాత ఫలితాల కోసం ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూస్తుంటారు నేతలు. ఫలితాల కోసం ఎదురుచూసే క్రమంలో వారికి క్షణం ఒక యుగంగా గడుస్తుంది. సాధారణంగా ఎన్నికలు పూర్తయిన వారం రోజుల్లో ఫలితాలు వస్తుంటాయి. కానీ ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో... ఆ ఎన్నికలకు సంబంధించిన దశలన్నీ పూర్తయ్యేంతవరకు మొదటి విడతలో జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం లేదు. మే 23న అధికారికంగా ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు వెయిట్ చేయలేకపోతున్న కొందరు అభ్యర్థులు... ఈలోపే తమ పరిస్థితి ఏంటనే విషయాన్ని తెలుసుకునేందుకు సర్వే సంస్థలను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికలు పూర్తయిన రెండు మూడు రోజుల తరువాత ఈ సర్వేల ప్రక్రియ ఊపందుకున్నట్టు సమాచారం. సాధారణంగా ఎన్నికలకు ముందు మీరు ఎవరికి ఓటు వేస్తారనే విషయంపై సర్వేలు చేసే సంస్థలు... ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా అభ్యర్థుల కోసం సర్వేలు చేసేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్స్ ద్వారా మీ ఎవరికి ఓటు వేశారనే అంశాన్ని నేరుగా అడగడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశంపై వివరాలు సేకరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలోని నగరి, పుంగూనురు, తిరుపతి, శ్రీకాళహస్తి సహా అనేక నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఇప్పటికే ఇలాంటి ప్రశ్నలతో కూడిన కాల్స్ వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. సగానికి పైగా ఓటర్ల మనోభావాలను తెలుసుకోవడం వల్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో ఒక అంచనాకు రావొచ్చని ఈ సర్వే నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఎన్నికలు ముగిసిన తరువాత ఫలితాల కోసం 40 రోజులు ఎదురుచూడాల్సి రావడం అభ్యర్థులకు అగ్నిపరీక్షగా మారింది.

First published: April 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>