AP Municipal Elections: ఓటర్లకు బంగారు ముక్కుపుకడకలు... మున్సిపల్ ఎన్నికల్లో పీక్స్ కి చేరిన ప్రలోభాలు..

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల్లో ( AP Municipal Elections) ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఎంతైనా పంచేందుకు సిద్ధమవుతున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఎంతైనా పంచేందుకు సిద్ధమవుతున్నారు. మద్యం, డబ్బులు, బిర్యానీలు, చీరలకంటే భిన్నంగా ఈసారి పంపిణీ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల గుర్తులను పోలిన వస్తువులను పంపిణీ చేసి ఓటర్లను బుట్టలో వేసుకున్న అభ్యర్థులు.. మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి రూటు మార్చారు. పట్టణాల్లో ఓటర్లు కొంచెం కాస్ట్లీ అనుకున్నారో లేక మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఇదే సరైనా వస్తువు అని భావించారో గానీ.. కడప జిల్లాలో ఏకంగా బంగారు ముక్కుపుడకలు పంపిణీ చేయడం కలకలం సృష్టిస్తోంది. అసలే బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో బంగారు ముక్కుపుడకలు పంపిణీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

  వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రమైన కడపలో నగరు శివారులోని ఇన్నర్ సర్కివ్ వద్ద ఓటర్లకు పంచడానికి తీసుకెళ్తున్న బంగారు ముక్కుపుడకలను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 987 ముక్కుపుడకలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కడప నగరంలోని 37వ డివిజన్లోని మహిళా ఓటర్లకు వీటిని పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తనయుడు ముక్కుపుడకలను తరలిస్తుండగా చెన్నూరు పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు ససమాచారం. ఓ ముఖ్యనేత నుంచి ఫోన్ వెళ్లడంతో దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదన్న వార్తలు వస్తున్నాయి.

  ఇది చదవండి: ఏపీలో మేయర్లు, కౌన్సిలర్ల జీతాలు ఎలా ఉంటాయో తెలుసా..?  మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రలోభాల ఫర్వం కొనసాగుతోంది. గ్రేటర్ విశాఖపరిధిలో మద్యం పంపిణీ విచ్చలవిడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ పార్టీల నేతలు, అభ్యర్థులు మద్యం పంపిణీ చేస్తున్నారు. తాజాగా 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్యర్థి కుటుంబ సభ్యులు మద్యం పంపిణీ చేస్తండగా పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల మధ్యంతో పాటు చీరలు, ఇతర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. యువకుల కోసం క్రికెట్, వాలీబాల్ కిట్లు, ఇతర క్రీడాసామాగ్రిని పంచుతుండగా..కొన్నిచోట్ల ఎక్కువగా ఓట్లున్న కుటుంబాలకు గృహోపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  ఇది చదవండి: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో విచిత్ర పొత్తులు.. మిత్రులెవరో.. శత్రువులెవరో..!


  Published by:Purna Chandra
  First published: