CANDIDATES DISTRIBUTING CHICKEN AND OTHER THINGS TO SATISFY VOTERS IN ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS HERE ARE THE DETAILS PRN
AP Panchayat Elections: ఒక్కో ఇంటికి మూడు కిలోల చికెన్... కాదంటే కోడి... ఓటర్లకు బంపర్ ఆఫర్
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడో దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడో దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. పల్లెల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. డబ్బులు, మందు, చీరలు ఇలా ఎవరికి తోచింది వారు పంపిణీ చేస్తూ ఓట్లు తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఈక్రమంలో కొన్నిచోట్ల అభ్యర్థులు ఓ అడుగు ముందుకేసి నచ్చింది తినమంటూ ఆఫర్ ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇంటింటింకీ మూడు కిలోల చికెన్, అది వద్దంటే ఎకంగా కోళ్లనే పంచిపెట్టారు. చికెన్ ను నేరుగా ఇళ్లకు తీసుకెళ్లి పంచకుండా ముందుగా టోకెన్లు ఇచ్చి చికెన్ షాపుకు వెళ్లి తెచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల వ్యాప్తంగా ప్రధాన పార్టీల మద్దతుదారులు చికెన్ పంపిణీ చేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే ఇంటింటికీ వెళ్లి టోకెన్లు పంచిన నేతలు.. చికెన్ షాపుకు వెళ్లి ఆ టోకెన్ ఇస్తే అందులో ఎంత ఉంటే అంత అక్కడే ముక్కలుగా కొట్టి ఇచ్చేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. అటు చికెన్ వ్యాపారులు కూడా ఎన్నికల పుణ్యమా అని బిజినెస్ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుందని చెప్తున్నారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే ఒక్కో చికెన్ షాపులో కనీసం వంద కిలోల వ్యాపారమైనా సాగుతుంది. అలాంటిది ఊరుఊరందిరికీ చికెన్ ఆర్డర్ రావడంతో గ్రామాల్లోని ఒక్కో చికెన్ వ్యాపారి దాదాపు 200 కిలోలకు పైగా సప్లై చేసినట్లు తెలుస్తోంది.
ఇక ముక్క, మందు మాత్రమే కాదు.. అభ్యర్థులు తమ గుర్తులకు సంబంధించిన వస్తువులను కూడా పంపిణీ చేస్తున్నారు. గౌన్లు, మంచాలు, కత్తెర్లు, కుక్కర్లు, గ్యాస్ స్టౌవ్ ఇసా తమకు గుర్తులను బట్టి ఓటర్లకు ఇస్తున్నారు. ఇక డబ్బుల సంగతి సరే సరి.. గ్రామాల్లో ఒక్కొక్క ఓటు కనీసం రూ.500 పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ ఓట్లున్న కుటుంబాలకు డబ్బులు కాకుండా గృహోపకరణాలతో కూడా గాలం వేస్తున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ప్రచారాలు, ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించడం కష్టమని తెలిసి.. ప్రలోభాలపైనే పూర్తిగా ఆధారపడినట్లు కనిపిస్తోంది.
రెండో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి మండలంలోని ఓ గ్రామంలో ఓటుకు ఏకంగా రూ.40 వేల వరకు అందాయి. గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఓటుకు రూ.10వేల చొప్పున పంచారు. అంటే ఈ ఇద్దరు అభ్యర్థల నుంచి ఒక్క ఓటుకు రూ.20వేలు అందాయి. ఇక ఉప సర్పంచ్ రేసులో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఒకే వార్డులో బరిలో ఉన్నారు. వారు కూడా రూ.10 చొప్పున పంచారు. ఈ వార్డులో 110 మంది ఓటర్లు ఉంటారు. ఒక్కొక్కరికి రూ.10వేలు పంచారు. ఇలా డిప్యూటీ సర్పంచ్ అభ్యర్థల నుంచి కూడా ఓటుకు రూ.20వేలు అందాయి. మొత్తంగా ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు, ఇద్దరు డిప్యూటీ సర్పంచ్ అభ్యర్థల నుంచి.. ఒక్క ఓటుకు రూ.40వేలు అందాయి
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.