మందుకొట్టి నామినేషన్ వేసిన అభ్యర్థి... పోలీసులు అరెస్ట్ చేసి..

40 ఏళ్ల రాజీవ్ కుమార్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. దీంతో నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యాడు.

news18-telugu
Updated: March 29, 2019, 3:38 PM IST
మందుకొట్టి నామినేషన్ వేసిన అభ్యర్థి... పోలీసులు అరెస్ట్ చేసి..
నమూనా చిత్రం
  • Share this:
మద్యపాన నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో ఓ ప్రజాప్రతినిధి వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఓ నేత నామినేషన్ వేసేందుకు వెళ్లి అరెస్ట్ అయ్యాడు. అదెలా అనుకుంటారా ? దీనికి కారణం అతను పీకలదాకా మందుకొట్టడమే. పూర్తిగా మద్య నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలో మందుకొట్టి నామినేషన్ వేసేందుకు వెళ్లడంతో పోలీసులు అతడ్ని పట్టుకొని లోపలేశారు. దీంతో రాజకీయాల్లో రాణించాలనుకున్న నాయకుడు.... జైల్లో కూర్చొని ఊచలు లెక్కెడుతున్నాడు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 40 ఏళ్ల రాజీవ్ కుమార్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. దీంతో నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యాడు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఆయన పూర్తిగా మద్యం మత్తులో ఉండటంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మద్యం తాగి వచ్చారా ? అని పోలీసులు ప్రశ్నించగానే.. అవును అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో రాజీవ్ కుమార్ సింగ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు మాత్రం అతడ్ని నామినేషన్ దాఖలు చేసిన తర్వాతే అరెస్ట్ చేశారు. రాజీవ్ కుమార్ సింగ్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
First published: March 27, 2019, 10:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading