Punjab politics: పీసీసీ చీఫ్​ సిద్దూ రాజీనామా అమరీందర్​ను ఆపగలదా? పంజాబ్​లో ఉత్కంఠగా రాజకీయ చదరంగం

అమరీందర్ సింగ్, నవ్‌జోత్ సింగ్ సిద్దు (ఫైలో ఫొటో)

సీఎం పదవి నుంచి దిగిపోయే సమయంలో కూడా రాజీనామా ఎందుకు చేస్తున్నారో కెప్టెన్​ అమరీందర్​ చెప్పలేదు. ఇపుడు పీసీసీ పదవి (PCC chief)కి రాజీనామా ఎందుకు చేశాడో సిద్దూ  (sidu) చెప్పలేదు. కానీ, ఒకరి రాజీనామాకు మరొకరు కారణమని మాత్రం తెలిసింది.

 • Share this:
  పంజాబ్ (Punjab)​. గత కొద్ది రోజులుగా రాజకీయ క్రీడల (political games)కు వేదికైంది. దేశం చూపు మొత్తం తనవైపే తిప్పుకుంటోంది. పంజాబ్​లోని కీలక కాంగ్రెస్​ నాయకులు కెప్టెన్​ అమరీందర్​ సింగ్ (Amarinder singh) ​, నవజ్యోత్​ సింగ్​ సిద్దూ (Navjot singh sidhu) ల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఎవరూ ఊహించని విధంగా పంజాబ్​ ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ (amarinder singh) దిగిపోవడం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఏకంగా పీసీసీ పదవి నుంచి నవజ్యోత్​ సింగ్​ సిద్దూ (Navjot singh sidhu) దిగిపోవడం మరో సంచలనం కలిగించింది. సామాన్య మానవుడికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎవరు ఎందుకు రాజీనామా (why they are resigning) చేస్తున్నారో? స్పష్టమైన కారణాలు మాత్రం చెప్పడం లేదు. కానీ, ఏవేవో ఆరోపణలు (allegations) చేసుకుంటూ ఉన్నారు. సీఎం పదవి నుంచి దిగిపోయే సమయంలో కూడా రాజీనామా ఎందుకు చేస్తున్నారో కెప్టెన్​ అమరీందర్​ చెప్పలేదు. ఇపుడు పీసీసీ పదవి (PCC chief)కి రాజీనామా ఎందుకు చేశాడో సిద్దూ  (siddu) చెప్పలేదు. కానీ, ఒకరి రాజీనామాకు మరొకరు కారణమని మాత్రం తెలిసింది.

  బీజేపీ వైపు చూస్తున్నారని..

  అయితే పంజాబ్​ సీఎం పదవికి అమరీందర్​ రాజీనామా (resign) చేసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లో కలవరం సృష్టించాయి. పీసీసీ చీఫ్​ అయిన నవజ్యోత్​ సింగ్​ సిద్దూ (Navjot singh sidhu) కి పాకిస్తాన్​ పీఎం ఇమ్రాన్​ఖాన్​తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పడం. అది పంజాబ్​ భవిష్యత్తు (Punjab future)కు ప్రమాదమంటూ ఆరోపణలు గుప్పించారు. అక్కడితో ఆగలేదు. సిద్ధూని రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఎంత దూరం అయినా వెళతానని చెప్పుకోచ్చారు. ఇపుడు ఏకంగా బీజేపీ (BJP) వైపు చూస్తున్నారని తెలియడంతో కాంగ్రెస్ (congress)​ పార్టీ అలెర్ట్​ అయిందని సమాచారం.

  ఢిల్లీకి వెళ్లడంతో..

  అయితే మంగళవారం నాడు అమరీందర్​ ఢిల్లీ (amarinder to delhi)కి పయనం అవడం దేశ రాజకీయాల్లో చర్చగా నిలిచింది. సిద్దూ మీద కోపంతోనే కాంగ్రెస్​ను వీడి బీజేపీలోకి చేరుతున్నట్లు పార్టీ భావించింది. దీంతో దిద్దుబాటు చర్యలకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో అమరీందర్​ వ్యవహారంలో పీసీసీ చీఫ్​ (PCC chief)గా ఉన్న సిద్దూ అసంతృప్తితో ఉన్నాడనేది జగమెరిగిన సత్యం. దీంతో తనే రాజీనామా (resignation)కు సిద్ధమవడం చర్చనీయాంశమైంది. తన రాజీనామాతో అయినా అమరీందర్​ కోపం తగ్గి కాంగ్రెస్ (congress)​లో ఉండొచ్చనే నమ్మకంతోనే సిద్దూ పీసీసీ పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తన రాజీనామాలో రాసిన కొన్ని పదాలు నేరుగా అమరీందర్​ను ఉద్దేశించి రాసినట్లుగా ఉంది. దీంతో అమరీందర్​ ఢిల్లీలో బీజేపీ చీఫ్​ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్​షా (Amit shah)లను ఇంకా కలవలేదనే టాక్​ ఉంది.  అయితే సిద్దూ (Navjot singh sidhu) రాజీనామాపై అమరీందర్​ విమర్శలు గుప్పించారు. అసలు సిద్ధూకి నిలకడనేదే (not stable) లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు ఢిల్లీకి వచ్చింది కేవలం సొంత పర్యటన నిమిత్తమని మీడియాకు ఆయన తెలిపారు. అయితే ఏది ఏమైనా అమరీందర్​ను బీజేపీకి వెళ్లకుండా సిద్దూ రాజీనామా ఆపగలదో లేదో వేచి చూడాలి. ఇదే సమయంలో పంజాబ్లో కాంగ్రెస్​​ పరిస్థితుల దృష్ట్యా రాహుల్​ చంఢీగడ్​లో వాలిపోయినట్లు సమాచారం.

  అయితే శిరోమణి అకాళీదల్​ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్​ సిద్దూ రాజీనామాపై స్పందిస్తూ ‘‘ నవజ్యోత్ సింగ్ సిద్దూ తప్పుదారి పట్టించే క్షిపణి అని నేను ముందే చెప్పాను, అది ఎక్కడికి వెళ్తుందో, ఎవరిని చంపుతుందో తెలియదు. అతను మొదట పంజాబ్ కాంగ్రెస్​లో  కెప్టెన్ (అమరీందర్ సింగ్) ను నాశనం చేశాడు . తరువాత అతని పార్టీని తుడిచిపెట్టాడు” అని అన్నాడు.
  Published by:Prabhakar Vaddi
  First published: