HOME »NEWS »POLITICS »can identify muslims by removing their clothes kerala bjp president makes controversial remark sk

'బట్టలు విప్పితే తెలుస్తుంది'..బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

'బట్టలు విప్పితే తెలుస్తుంది'..బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం

ముస్లిం సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారని కాంగ్రెస్, సీపీఎం నేతలు మండిపడుతున్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Share this:
    రెండోవిడత ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలవడంతో దేశవ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నారు అభ్యర్థులు. ఒక్కోసారి నోరుజారుతూ, కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అగ్గిరాజేస్తున్నారు. ఇప్పటికే యూపీలో ఆజంఖాన్, యోగి ఆదిత్యనాథ్, మాయావతి, మేనకా గాంధీ వంటి నేతలు విద్వేష ప్రసంగాలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఈ క్రమంలో మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    కేరళలో అట్టింగల్ లోక్‌సభ నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్‌కు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీపీ శ్రీధరన్ పిళ్లై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బాలాకోట్‌ వైమానికదాడులపై విపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తూ..సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. బాలాకోట్‌లో ఏ మతం వాళ్లు చనిపోయారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయన్న శ్రీధరన్..మృతుల బట్టలు విప్పిచూస్తే వాళ్లు ముస్లింలో కాదో తెలుస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.



    రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి, పినరయి విజయన్ వంటి నేతలు బాలాకోట్‌ వెళ్లి మృతులను లెక్కబెట్టాలని కోరుతున్నారు. వాళ్లది ఏ కులం, ఏ మతమంటూ ప్రశ్నిస్తున్నారు. ఇస్లాం మతంలో అయితే కొన్ని గుర్తులుంటాయి. మృతుల బట్టలు విప్పితే తెలుస్తుంది. వాళ్లు ముస్లింలో కాదో తెలుస్తుంది.
    పీఎస్ శ్రీధరన్ పిళ్లై, కేరళ బీజేపీ చీఫ్

    శ్రీధరన్ పిళ్లై

    శ్రీధరన్ పిళ్లై వ్యాఖ్యలు కేరళలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముస్లిం సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారని కాంగ్రెస్, సీపీఎం నేతలు మండిపడుతున్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, యూపీలో విద్వేష ప్రసంగాలు చేసిన యోగి, మాయావతి, మేనకా గాంధీ, ఆజంఖాన్ ఎన్నికల ప్రచారంపై ఇప్పటికే ఆంక్షాలు విధించిన విషయం తెలిసిందే.


    First published:April 16, 2019, 07:45 IST