మమ్మల్ని బోనులో జంతువుల్లా బంధించారు : మోహబూబా ముఫ్తీ కుమార్తె

Itija Mufti on Kashmir : మీడియాతో మాట్లాడినందుకే తనను హౌజ్ అరెస్ట్ చేశారని.. మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని ఇతిజా ముఫ్తీ ఆరోపించారు.

news18-telugu
Updated: August 16, 2019, 1:27 PM IST
మమ్మల్ని బోనులో జంతువుల్లా బంధించారు : మోహబూబా ముఫ్తీ కుమార్తె
మెహబూబా ముఫ్తీ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఓవైపు దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగి తేలుతుంటే.. కశ్మీరీ ప్రజలు మాత్రం బోనుల్లో జంతువుల్లా బంధించబడ్డారని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇతిజా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. పలువురు బడా నేతలను హౌజ్ అరెస్ట్ చేయడం.. జమ్మూకశ్మీర్‌లో ఇంకా ఆంక్షలను సడలించకపోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. అంతేకాదు, తాజాగా ఓ వాయిస్ మెసేజ్ కూడా ఆమె విడుదల చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కానప్పటికీ.. ఎవరిని తనతో కలవనివ్వడం లేదని ఇతిజా అన్నారు.కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.మీడియాతో మాట్లాడినందుకే తనను హౌజ్ అరెస్ట్ చేశారని.. మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని ఇతిజా ముఫ్తీ ఆరోపించారు. తనను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారో ఇప్పటికీ అర్ధం కావడం లేదని.. హోంమంత్రి అమిత్ షా దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుకు ముందే ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీ లాంటి నేతలను గృహ నిర్బంధం చేయగా.. ఇప్పటికీ వారిపై నిర్బంధం కొనసాగుతోంది.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...