ఏపీలో మావోయిస్టుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ

నక్సల్స్ సమస్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.

news18-telugu
Updated: July 15, 2019, 2:26 PM IST
ఏపీలో మావోయిస్టుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు సమస్యలపై ప్రభుత్వం... క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన అధ్యక్షతన మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారు. హోం, రెవెన్యూ, గిరిజన సంక్షేమము,రహదారులు భవనాల శాఖ సభ్యులుగా ఉప సంఘం ఏర్పాటు చేశారు. లొంగిపోయిన నక్సల్స్ పునరావాసం, తీవ్రవాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపులో విధాన రూపకల్పన, ధ్వంసం అయిన ఆస్తులకు పరిహారం తదితర అంశాల్లో మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించనుంది. నక్సల్స్ సమస్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులకు నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading