Home /News /politics /

CABINET RESHUFFLE UNION MINISTERS SANTOSH GANGWAR RAMESH POKHRIYAL QUIT AHEAD OF REJIG SK

Cabinet Reshuffle: పలువురు కేంద్రమంత్రుల రాజీనామా.. కేబినెట్‌లో కీలక మార్పులు

ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా (ఫైల్)

ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా (ఫైల్)

Union Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో పలువురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించారు. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్‌, కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్‌కి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికారు. ఇప్పటికే వీరిద్దరు రాజీనామా చేశారు.

ఇంకా చదవండి ...
  ఇప్పుడు దేశమంతా కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ గురించే చర్చ జరుగుతోంది. కేంద్ర కేబినెట్‌లో భారీగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొందరిని ఇప్పటికే మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇంకొందరికి ప్రమోష్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఏకంగా 21 మంది కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవులు ఖరారైన వారికి ఇప్పటికే ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి ఫోన్స్ కాల్స్ వెళ్లాయి. వారంతా ఒక్కొక్కరుగా ప్రధాని నివాసానికి చేరుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో పలువురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించారు. ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్ విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్‌, కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్‌, దేబశ్రీ చౌదురి, సంజయ్ ధోత్రే, రావ్ సాహెబ్ ధన్వే పాటిల్‌ను మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికారు. ఇప్పటికే వీరు రాజీనామా చేశారు.

  కరోనా నేపథ్యంలో సీబీఎస్ పరీక్షలకు సంబంధించి ముందస్తుగా ఏదీ సిద్ధం చేసుకోలేదని రమేష్ పొఖ్రియాల్‌పై విమర్శలు ఉన్నాయి. ప్లాన్ బీ రెడీగా పెట్టుకోలేకపోయారని.. అందుకే గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రధాని మోదీ అసంతృప్తిగా ఉన్నారట. ఈ కారణంగా మోదీ నేతృత్వంలోనే సీబీఎస్ఈ పరీక్షలపై సమీక్షా సమావేశం జరిగిన జరిగింది. ఆ తర్వాతే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పొఖ్రియాల్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కారణాలతో ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించినట్లు సమాచారం. ఇక వయసు రీత్యా కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను కూడా కేబినెట్ నుంచి తప్పించారు. మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి దేబశ్రీ చౌదురి సైతం మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.

  కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి సదానంద గౌడకి కూడా ఉద్వాసన పలికినట్లు సమాచారం అందుతోంది. ఆ పదవిని కర్నాటక కోటాలో ఎంపీ శోభా కరంద్లాజేకు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇక స్మృతి ఇరానీని కూడా తప్పించవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను స్మృతికి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. యూపీలో మాయవతి, ప్రియాంక గాంధీలను ధీటుగా ఎదుర్కొనేందుకు స్మృతిని రంగంలోకి దించనున్నట్లు సమాచారం.

  పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ఇవాళ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మోదీ కొత్త టీమ్‌లో యువ నేతలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు పెద్ద పీట వేసినట్లు సమాచారం. బీసీలకు 27, ఎస్టీలకు 17, ఎస్టీకి 7 పదవులు కేటాయించినట్లు సమాచారం. ఇద్దరు బుద్దిస్ట్‌లు, ఒక ముస్లిం, ఒక సిక్కు,ఒక క్రిస్టియన్‌కు కలిపి మొత్తం 5 మంత్రి పదవులను మైనారిటీలకు కేటాయించారు. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేఖి, అనుప్రియ పటేల్, అజయ్ భట్, శోభా కరంద్లాజే, సునీత దుగ్గ, శంతను ఠాకూర్, ప్రీతమ్ ముండే, నారాయణ్ రాణె, కపిల్ పాటిల్, పశుపతి నాథ్ పరాస్, ఆర్సీపీ సింగ్, కిషన్ రెడ్డి, పురుషోత్తం రూపాల, అశ్విని వైష్ణవ్, మన్‌సుఖ్ ఎల్.మాండవీయ, హర్దీప్ పూరి, రాజీవ్ చంద్రశేఖర్, బీఎల్ వర్మ, నిశిత్ ప్రమాణిక్, ప్రతిభ భౌమిక్, డాక్టర్ భారతి పవార్, భగవత్ కరాడ్, ఎస్పీ సింగ్ బఘేల్ ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cabinet Reshuffle, Narendra modi, PM Narendra Modi, Union cabinet

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు