ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్, విప్‌లకు కేబినెట్ హోదా

ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. వారికి అదనంగా మరికొంతమందికి క్యాబినెట్ హోదా కల్పించారు.

news18-telugu
Updated: August 1, 2019, 10:28 PM IST
ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్, విప్‌లకు కేబినెట్ హోదా
ఏపీ అసెంబ్లీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చీఫ్ విప్, ఏడుగురు విప్‌లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్‌లు బుడి ముత్యాల నాయుడు, దాడి శెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు క్యాబినేట్‌ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చీఫ్ విప్, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు కూడా కేబినెట్ హోదా కల్పించింది. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. వారికి అదనంగా ఇప్పుడు మరో తొమ్మిది మందికి కొత్తగా క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు