కరుణ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రద్దు.. ఎందుకంటే?

రాజకీయ కురువృద్ధుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం తిరువారూర్. అయితే, ఈ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్.. ఇప్పుడా ఎన్నికను రద్దు చేసింది.

news18-telugu
Updated: January 7, 2019, 6:42 PM IST
కరుణ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రద్దు.. ఎందుకంటే?
కరుణానిధి ఫైల్ ఫొటో
news18-telugu
Updated: January 7, 2019, 6:42 PM IST
డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి మరణంతో తమిళనాడులో ఒక రాజకీయ శకం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన ప్రాతినిథ్యం వహించిన తిరువారూర్ హాట్ టాపిక్‌గా మారింది. కరుణానిధి రాజకీయవారసుడిగా ఉన్న స్టాలిన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ జరిగింది. కానీ, డీఎంకే మాత్రం మరో అభ్యర్థిని ప్రకటించింది. అదలా ఉండగా, ఖాళీ అయిన తిరువారూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించ తలపెట్టింది ఎలక్షన్ కమిషన్. జనవరి 28న తిరువారూర్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది ఈసీ. ఇటీవల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, ఆ ఎన్నికను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

ఇటీవల వచ్చి గజ తుఫాను కారణంగా.. తిరువారూర్ సహా చుట్టు పక్కల ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అధికార యంత్రాంగం తుఫాను సహాయక చర్యలలో బిజీగా ఉంది. అందుకే, తిరువారూర్ ఉప ఎన్నికను వాయిదా వేయాలంటూ జిల్లాయంత్రాంగం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు, తిరువారూర్ ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్టు తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారికి సమాచారం అందించారు. దీంతో ఈనెల 28న జరగాల్సిన ఉప ఎన్నిక రద్దైంది.

కాగా, ఇప్పటికే ఈ ఉప ఎన్నికలకు సంబంధించి డీఎంకే, ఏఎంఎంకే పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. అధికార అన్నాడీఎంకే సైతం అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపింది. దీంతో ఈ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా యాంత్రం కోరడంతో ఈసీ సానుకూలంగా స్పందించింది. ఎన్నికను రద్దు చేసింది.

First published: January 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...