బీజేపీలో ఎగ్జిట్‌పోల్స్ జోష్..ఎన్డీయే నేతలకు అమిత్ షా డిన్నర్ పార్టీ

ఎన్డీయేకు 300 పైచిలుకు స్థానాలు వస్తాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నాయి.

news18-telugu
Updated: May 20, 2019, 9:48 PM IST
బీజేపీలో ఎగ్జిట్‌పోల్స్ జోష్..ఎన్డీయే నేతలకు అమిత్ షా డిన్నర్ పార్టీ
అమిత్ షా
  • Share this:
మే 23న నమో తుఫాన్ రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.  బీజేపీయే మరోసారి అధికారం చేపడుతుందని  జోస్యం చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ శుభావర్త చెప్పడంతో బీజేపీ శ్రేణుల్లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. కమల నేతల్లోనూ ఆ జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్డీయే పక్షాలకు మంగళవారం గ్రాండ్‌గా డిన్నర్ పార్టీ ఇస్తున్నారు. ఇప్పటికే ఎన్డీయేలోని అన్ని పార్టీలకు బీజేపీ ఆహ్వానం పంపింది.  ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపైనా  నేతలు చర్చించనున్నారు.  అదే రోజు కేంద్రమంత్రి వర్గ సమావేశం కూడా జరగనుంది.

ఎన్డీయేకు 300 పైచిలుకు స్థానాలు వస్తాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నాయి. ఐతే విపక్షాలు మాత్రం ఈ సర్వేలను కొట్టిపారేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌ని ఎవరూ నమ్మడం లేదని..మే23న ఊహించని ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక  కూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు నేతృత్వంలోని విపక్షాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.  కాగా, ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్త ఏడు దశల్లో 542 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ధనప్రవాహం కారణంగా వేలూరు (తమిళనాడు)లో ఎన్నికలను రద్దుచేసింది ఈసీ. గురువారం ఫలితాలు రాబోతున్నాయి.

 

 

First published: May 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>