ఏపీలో ఇసుక కొరతపై రాజకీయ రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతపై ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెబుతున్న ఏపీ మంత్రులకు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు ఇదే రకమైన అనుభవం ఎదురైంది. సోమవారం నగరంలో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక కొరతతో పస్తులుంటున్నామని మంత్రిపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కార్మికులకు నచ్చజెప్పేందుకు మంత్రి ప్రయత్నించారు.
వారం పదిరోజుల్లో ఇసుక సమస్య పరిష్కారమవుతుందని కార్మికులకు ఆయన హామీ ఇచ్చారు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే అని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నగరంలో అభివృద్ధి పనులని త్వరితగతిన పూర్తి చేస్తామని.. రంజాన్ పండుగకి షాదీ మంజిల్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.