LIVE NOW

Union Budget 2020 live updates: ప్రత్యక్ష పన్నుల్లో భారీ సంస్కరణలు

Live Union Budget 2020 Updates | రూ.2.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదన్నారు నిర్మల. రూ.2.5 లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 5శాతం పన్ను వర్తిస్తుందన్నారు.

Telugu.news18.com | February 1, 2020, 1:49 PM IST
facebook Twitter Linkedin
Last Updated February 1, 2020
auto-refresh
లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఆమె పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా ఆమె పన్ను చెల్లింపు శ్లాబ్స్‌లో మార్పులు చేర్పులు చేశారు. రూ.5 లక్షల నుంచి రూ. 7.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారు గతంలో 20శాతం పన్ను చెల్లించే వారు. దాన్ని 10 శాతానికి తగ్గించారు. రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఆదాయం ఉన్నవారు గతంలో 20 శాతం చెల్లించేవారు. దాన్ని 15శాతానికి తగ్గించారు. దీంతో పాటు రూ.10లక్షల నుంచి రూ.12.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారు గతంలో 30 శాతం పన్ను చెల్లించేవారు. దాన్ని 20 శాతానికి తగ్గించారు. రూ.12.5లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి గతంలో 30 శాతం పన్ను ఉండేది. దాన్ని 25శాతానికి కుదింపు చేశారు.  రూ.15లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి గతంలో ఉన్నట్టే 30శాతం పన్ను కొనసాగింపు వర్తిస్తుంది.

అంతకు ముందు కేంద్ర కేబినెట్ పార్లమెంటు ఆవరణలో సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.  అటు నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలిశారు. బడ్జెట్‌‌లో ప్రధాన అంశాలను రాష్ట్రపతి కోవింద్‌కు వివరించారు. గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ..సూట్ కేసుతో కాకుండా ఎర్రటి వస్త్రాన్ని కప్పిన చిట్టాపద్దుతో పార్లమెంటుకు వచ్చారు నిర్మలా సీతారామన్.
Read More
Load More



నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. కార్పొరేట్ వర్గాలు, వ్యాపారులు, వేతనజీవులు..ఇలా అన్ని వర్గాల వారు నిర్మలమ్మ బడ్జెట్‌పై ఆసక్తి చూపుతున్నారు.  బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ను చూశాక మార్కెట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
corona virus btn
corona virus btn
Loading