మాజీ ఎమ్మెల్యేను బుజ్జగిస్తున్న టీడీపీ ముఖ్యనేత

విజయవాడలోని బొండా ఉమా నివాసానికి వెళ్లిన బుద్దా వెంకన్న... పార్టీ మారొద్దని బుజ్జగించడానికే ఆయనను కలిశారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

news18-telugu
Updated: August 10, 2019, 2:11 PM IST
మాజీ ఎమ్మెల్యేను బుజ్జగిస్తున్న టీడీపీ ముఖ్యనేత
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన మెజార్టీ రాజ్యసభ సభ్యులు ఇప్పటికే బీజేపీలో చేరిపోగా... రాష్ట్రంలోని మరికొందరు నేతలు కూడా అటువైపు చూస్తున్నారు. వీరిలో కొందరు నేతలు ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను ఆ పార్టీ ముఖ్యనేత బుజ్జగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి చెందిన విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పార్టీ మారతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

బొండా ఉమ బీజేపీలోకి వెళతారని కొందరు... వైసీపీ వైపు చూస్తున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఏ పార్టీలో వెళతారనే విషయం తెలియకపోయినా... బొండా ఉమ టీడీపీని వీడటం ఖాయమనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం విదేశాలకు వెళ్లి అక్కడ బంగీ బంప్ చేసిన బొండా ఉమ... రాగానే మరో పార్టీలోకి జంప్ చేస్తారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ ముఖ్యనేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బొండా ఉమాను కలవడం ప్రాధాన్యత సంతకరించుకుంది.

విజయవాడలోని బొండా ఉమా నివాసానికి వెళ్లిన బుద్దా వెంకన్న... పార్టీ మారొద్దని బుజ్జగించడానికే ఆయనను కలిశారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు చంద్రబాబుకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుద్దా వెంకన్న... పార్టీ అధినేత ఆదేశాలతోనే బొండా ఉమతో చర్చలు జరుపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి పార్టీ మారాలనే విషయాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ... బుద్దా వెంకన్న బుజ్జగింపుతో కూల్ అవుతారా లేదా అన్నది చూడాలి.
First published: August 10, 2019, 2:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading