దళితులను ఓటు వేయనీయని పోలీసులు..గాల్లోకి కాల్పులు...

ఈ వ్యవహారంపై బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దళితులను ఓటువేయకుండా బీజేపీ నేతలు అడ్డుకున్నారని బీఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు.

news18-telugu
Updated: April 11, 2019, 7:32 PM IST
దళితులను ఓటు వేయనీయని పోలీసులు..గాల్లోకి కాల్పులు...
కైరానాలో పోలింగ్
news18-telugu
Updated: April 11, 2019, 7:32 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో తొలివిడత పోలింగ్ ముగిసింది. దేశవ్యాప్తంగా 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. చెదురు మదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఐతే యూపీలో ఎన్నికల సిబ్బంది, పోలీసులపై ఎస్పీ-బీఎస్పీ కూటమి సంచలన ఆరోపణలు చేసింది. కైరానా లోక్‌సభ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో దళితులను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఓటర్ జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ పోలింగ్ స్టేషన్‌లకు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా గాల్లోకి కాల్పులు జరిపి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ధ్వజమెత్తారు. దళిత ఓటర్లను తీవ్రంగా అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

షామ్లీ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రానికి సుమారు 30 మంది దళిత ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్లారు. వారి వద్ద ఎలాంటి ఐడెండిటీ కార్డు లేకపోవడంతోనే అడ్డుకున్నామని ఎన్నికల సిబ్బంది స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో పేర్లు కూడా లేవని స్పష్టంచేశారు. ఓటు వేస్తామంటూ ఎన్నికల సిబ్బందితో గొడవ పెట్టుకోవడంతో భద్రతా సిబ్బంది కలగజేసుకున్నారని చెప్పారు. ఐనా వినకుండా గొడవ చేయడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని స్పష్టంచేశారు. అంతేతప్ప దళితులను చిన్నచూపు చూడలేదని తెలిపారు పోలీసులు.

ఈ వ్యవహారంపై బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దళితులను ఓటువేయకుండా బీజేపీ నేతలు అడ్డుకున్నారని బీఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది కూడా వారికే సహకరించారని ధ్వజమెత్తారు. ఐతే వారి ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఓటమి భయంతో ముందే కారణాలు వెతుక్కుంటున్నారని ఎదురుదాడికి దిగారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా తొలిదశ కింద 7 స్థానాల్లో పోలింగ్ జరిగింది. కైరానాతో పాటు సహారన్‌పూర్, ముజఫర్ నగర్, బిజ్నోర్, మీరట్, బాగ్‌ఫట్, ఘజియాబాద్, గౌతంబుద్దనగర్‌లో గురువారం ఎన్నికలు జరిగాయి.


First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...