Home /News /politics /

BSP RELEASES LIST OF 20 STAR CAMPAIGNERS MAYAWATIS NEPHEW AKASH ANANDS NAME IN LIST MS

బీఎస్పీ స్టార్ క్యాంపెయినర్స్ వీరే.. జాబితా విడుదల చేసిన మాయావతి

బీఎస్పీ అధినేత్రి మాయావతి (File)

బీఎస్పీ అధినేత్రి మాయావతి (File)

BSP Star-Campaigners : బీఎస్పీ తాజాగా విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ జాబితాలో మొత్తం 20 మందికి చోటు కల్పించారు. జాబితాలో మాయావతితో పాటు ఆమె మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ పేరు కూడా ఉండటం గమనార్హం.

    బహుజన సిద్దాంతంతో దేశంలోని మెజారిటీ కులాలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించాలన్న బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కల ఇప్పటివరకు సాధ్యపడలేదు. కాన్షీరాం పని విధానంతో గతంలో ఉత్తరప్రదేశ్‌లో విజయం సాధించిన బీఎస్పీ.. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనూ ఉనికి కోసం పాకులాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలు బీఎస్పీకి చావో.. రేవో.. అన్నట్టుగా తయారయ్యాయి. ఈ ఎన్నికల్లో పుంజుకుంటే తప్ప బీఎస్పీ రాజకీయం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి భావిస్తున్నారు. ఇందుకోసం స్టార్ క్యాంపెయినర్ లిస్టును కూడా రెడీ చేశారు.

    బీఎస్పీ తాజాగా విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ జాబితాలో మొత్తం 20 మందికి చోటు కల్పించారు. జాబితాలో మాయావతితో పాటు సతీష్ చంద్ర మిశ్రా, ఆర్ఎస్ కుష్వాహనా, షంషుద్దీన్ రయిన్, రాజ్‌కుమార్ గౌతమ్, నరేష్ గౌతం, సురేష్ కశ్యప్, మహిపాల్ సింగ్ మజ్రా, జనేశ్వర్ ప్రసాద్, ప్రేమ్‌చంద్ గౌతమ్, సత్పాల్ పీప్లా, రాజ్‌కుమార్, కమల్ సింగ్ రాజ్, మురారి లాల్, దినేశ్ కాజిపూర్, వీరేంద్ర జాదవ్, రణ్‌విజయ సింగ్, పూజన్ ప్రసాద్ ఉన్నారు.జాబితాలో మాయావతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు కూడా చోటు దక్కడం గమనార్హం.

    కాగా, ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాయావతి నిర్ణయించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల కోసం చాలా రాష్ట్రాల్లో ప్రచారం చేయాల్సి ఉన్నందునా.. కేవలం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కావాలని తాను భావించడం లేదని మాయావతి చెప్పారు. అవసరమైతే ఎన్నికల తర్వాత పార్టీ ఎంపీ ఎవరితోనైనా రాజీనామా చేయించి.. ఆ స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టత ఇచ్చారు.


    (బీఎస్పీ స్టార్ క్యాంపెయినర్స్ వివరాలు..)
    First published:

    Tags: Bsp, Lok Sabha Election 2019, Mayawati, Sp-bsp, Uttar pradesh, Uttar Pradesh Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు