BSP PARTY BANK BALANCE IS HIGHEST IN COUNTRY WITH RS 668 CRORES MK
బ్యాంకు బాలెన్స్లో బీజేపీనే మించిపోయిన మాయావతి పార్టీ ?
మాయావతి
ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన జమాఖర్చుల నివేదికలో బీఎస్పీ పార్టీకి చెందిన 8 బ్యాంకు అకౌంట్లలో మొత్తం రూ.669 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. అంతే కాదు మొత్తం 95.54 లక్షలు క్యాష్ ఇన్ హ్యాండ్ గా చూపించింది.
ఉత్తర ప్రదేశ్లో మహాఘట్బంధన్గా ముందుకు వచ్చిన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలకు నిధుల వరద పారుతోంది. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే...మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీ పార్టీకి బ్యాంక్ బ్యాలెన్స్ పరంగా చూస్తే దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా అవతరించింది. ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన జమాఖర్చుల నివేదికలో బీఎస్పీ పార్టీకి చెందిన 8 బ్యాంకు అకౌంట్లలో మొత్తం రూ.669 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. అంతే కాదు మొత్తం 95.54 లక్షలు క్యాష్ ఇన్ హ్యాండ్ గా చూపించింది. అదే సమాజ్ వాదీ పార్టీ మాత్రం తమ బ్యాంకు ఖాతాలో మొత్తం రూ.471 కోట్లు ఉన్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా తమ నిధులు కొద్దిగా తగ్గాయని తెలిపింది. ఇక మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ రూ.196 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. ఇక నాలుగో స్థానంలో టీడీపీ రూ.107 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ చూపగా, బీజేపీ మాత్రం తమ బ్యాంకు బ్యాలెన్స్ రూ.82 కోట్లు ఉన్నట్లు తెలిపింది.
ఇదిలా ఉంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల కారణంగా తమ బ్యాంకు బ్యాలెన్సులో రూ.11 కోట్లు ఖర్చు అయినట్లు సమాజ్ వాదీ పార్టీ తెలిపింది. అయితే బీఎస్పీ మాత్రం ఎన్నికల నేపథ్యంలో అనూహ్యంగా నిధులు సమకూర్చుకుంది. కాగా, అసోసియేట్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్నుల ప్రకారం బీజేపీ 2017-18 సంవత్సరానికి గానూ రూ.1034 కోట్ల ఆదాయాన్ని పేర్కొంది. అలాగే అన్ని పార్టీలు కూడా తమ ఆదాయంలో 87 శాతం నిధులు వాలంటరీ దాతల నుంచి సేకరించినవే కావడం విశేషం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.