ఆ కేసులన్నీ ఎత్తేయండి..కాంగ్రెస్ ప్రభుత్వాలకు మాయావతి అల్టిమేటం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా ఆందోళనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలంటూ మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకి మాయావతి అల్టిమేటం ఇచ్చారు.

news18-telugu
Updated: December 31, 2018, 6:23 PM IST
ఆ కేసులన్నీ ఎత్తేయండి..కాంగ్రెస్ ప్రభుత్వాలకు మాయావతి అల్టిమేటం
మాయావతి (ఫైల్ ఫొటో)
  • Share this:
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలకు మద్దతు విషయంలో బీఎస్పీ అల్టిమేటం ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా 2018 ఏప్రిల్ 2 తేదీన చేపట్టిన ‘భారత్ బంద్’ సందర్భంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలకు బయటి నుంచి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకునే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఓ ప్రకటనలో హెచ్చరించింది.

ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ పలు విపక్షాలు, దళిత సంఘాలు ఏప్రిల్ 2న ‘భారత్ బంద్’ పాటించాయి. భారత్ బంద్ సందర్భంగా చోటుచేసుకున్న వివిధ హింసాత్మక ఆందోళన కార్యక్రమాల్లో 10 మంది మృతి చెందగా...పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులపై పోలీసులు నమోదు చేశారు.

ఈ కేసులను ఎత్తివేయాలంటూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు బీఎస్పీ అల్టిమేటం విధించడం..కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడి రెండు వారాలు గడవక ముందే మాయావతి మద్దతు ఉపసంహరణపై హెచ్చరికలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రెండుసీట్ల దూరంలో నిలవగా...బీఎస్పీ మద్దతు ప్రకటించింది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి అప్పట్లో ప్రకటించారు.
First published: December 31, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading