Home /News /politics /

BSP CHIEF MAYAWATI WONT CONTEST UP ASSEMBLY ELECTION 2022 SAYS PARTY MP SATISH CHANDRA MISRA MKS

UP Election 2022: మాయావతి ఎక్కడ? పోటీకి దూరంగా BSP అధినేత్రి

బీఎస్పీ అధినేత్రి మాయావతి

బీఎస్పీ అధినేత్రి మాయావతి

యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ-యోగి జోడి, అఖిలేశ్-జశ్వంత్ జోడి, ప్రియాంకా గాంధీ దూసుకుపోతోంటే బీఎస్పీ చీఫ్ మాయావతి మాత్రం కేవలం ట్విటర్ ప్రకటనలకే పరిమితం అయ్యారనే విమర్శలు కొద్దిరోజులుగా వెల్లువెత్తుతున్నాయి. ఇది చాలదన్నట్లు, అసలు ఎన్నికల బరిలోకే దిగకూడదని మాయావతి నిర్ణయించుకున్నారు.

ఇంకా చదవండి ...
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల హడావుడి పీక్స్ కు చేరుతోంది. షెడ్యూల్ ప్రకటనకు రెండు నెలల ముందు నుంచే వరుసగా వేల కోట్ల అభివృద్ది కార్యక్రమాలతో పీఎం మోదీ, సీఎం యోగి బీజేపీ ప్రచారాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లగా, కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్. కాంగ్రెస్ తురుపుముక్క ప్రియాంక గాంధీ సైతం ప్రచారంలో ముందున్నారు. కానీ, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి మాత్రం దాదాపు ఎక్కడా కనిపించడంలేదు. మీడియాలోనే కాదు, మామూలుగానూ బీఎస్పీ ప్రచార దృశ్యాలు మృగ్యమయ్యాయి. ఇది చాలదన్నట్లు, అసలు ఎన్నికల బరిలోకే దిగకూడదని మాయావతి నిర్ణయించుకున్నారు. అయితే, అధికారం మాత్రం కచ్చితంగా తమదేనిన ఆమె సన్నిహితులు దీమా వ్యక్తం చేస్తున్నారు..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చీఫ్ మాయావతి పోటీ చేయడంలేదు. మాయ ఈసారి కూడా అసెంబ్లీ బరిలో పోటీకి దూరంగా ఉండాలని డిసైడైనట్లు బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో మాట్లాడిన మిశ్రా.. మాయావతి ప్రచారంలో పాల్గొనకపోవడం, యూపీలో బీఎస్పీ సన్నద్ధత తదితర అంశాలపై వివరణ ఇచ్చారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సీఎం యోగి ఈసారి మథుర నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Pig Heart In Human: వైద్య చరిత్రలో అద్భుతం: మనిషికి పంది గుండె అమర్చిన డాక్టర్లు


ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాయవతి పోటీ చేయడం లేదని, తాను(మిశ్రా) కూడా పోటీకి దూరంగా ఉంటానని ఎంపీ తెలిపారు. బీఎస్పీ అభ్యర్థులు ఒంటరిగానే 403 సీట్లలో పోటీకి దిగుతారని, అందరూ ఊహిస్తున్నట్లు యూపీలో మరోసారి బీజేపీనో లేక సమాజ్ వాదీ పార్టీనో గెలవబోదని, యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది బీఎస్పీనే అని మిశ్రా అన్నారు.

shocking video: విమానాన్ని ఢీకొట్టిన రైలు.. ఒక్క సెకన్‌లో జీవితం తారుమారు..



యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ-యోగి జోడి, అఖిలేశ్-జశ్వంత్ జోడి, ప్రియాంకా గాంధీ దూసుకుపోతోంటే బీఎస్పీ చీఫ్ మాయావతి మాత్రం కేవలం ట్విటర్ ప్రకటనలకే పరిమితం అయ్యారనే విమర్శలు కొద్దిరోజులుగా వెల్లువెత్తుతున్నాయి. కాగా, మాయావతి కావాల్సినంత చురుకుగా ఉన్నారని, ఎన్నికలపై ఎప్పటికప్పుడు నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూనేఉన్నారని ఎంపీ మిశ్రా తెలిపారు.

covid-19: అమెరికాలో అల్లకల్లోలం -కుప్పకూలనున్న ఆరోగ్య వ్యవస్థ!


మాయవతి 66వ పుట్టినరోజైన జనవరి 15న బీఎస్‌పీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు బీఎస్పీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, కోవిడ్ కేసులు పెరుగుతుండటం, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున పార్టీ కార్యకర్తలు తన పుట్టినరోజు వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని మాయావతి ఇటీవల కోరారు.యూపీలో ఏడు విడతల పోలింగ్ ఫిబ్రవరి 10తో ప్రారంభమై మార్చి 7వ తేదీతో పూర్తవుతాయి. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Bsp, Mayawati, Uttar Pradesh Assembly Elections

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు