Home /News /politics /

BSP CHIEF MAYAWATI NOT CONTESTING IN 2019 GENERAL ELECTIONS HERE IS THE MAIN REASON PS

2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా మాయావతి? కారణమిదేనట?

బీఎస్పీ అధినేత్రి మాయావతి(ఫైల్ ఫోటో)

బీఎస్పీ అధినేత్రి మాయావతి(ఫైల్ ఫోటో)

ప్రధాని అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్న మాయావతి.. పోటీకి దూరంగా ఉండబోతున్నారనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అసలామె, ఎందుకీ నిర్ణయం తీసుకున్నారనే అంశంపై విశేషంగా చర్చ సాగుతోంది. దాదాపు, రెండున్నర దశాబ్దాల తర్వాత ములాయం సింగ్ యాదవ్ పార్టీతో వేదిక పంచుకోబోతున్న మాయావతి.. తాను పోటీ చేసేందుకు అంబేడ్కర్‌ నగర్‌, నగీనా పార్లమెంటు స్థానాలను పరిశీలించారు.

ఇంకా చదవండి ...
    బీజేపీ అధికారంలోకి వస్తే మోదీయే ప్రధాని. మరి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాల కూటమి గెలిస్తే ప్రధాని ఎవరవుతారంటే మాత్రం.. రాహుల్ గాంధీతో పాటు వివిధ పార్టీల అధినేతల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. అందులో ప్రముఖంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీని ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యంతో ఆమె పనిచేస్తున్నారు. యూపీలో తన చిరకాల ప్రత్యర్థి అయిన.. సమాజ్‌వాది పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నారు. మోదీకి మరో అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో .. యూపీలో చెరో 38 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆమె యూపీలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే అంశంపై సందిగ్ధత ఏర్పడింది. కానీ, తాజాగా ఆమె పోటీకి సంబంధించి సంచలన విషయం ప్రచారంలోకి వచ్చింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మాయావతి పోటీ దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలోనూ ఆమె ఈ సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నాయి.

    sp bsp alliance, sp bsp seat sharing, up loksabha seats, mayavati akhilesh yadav, loksabha elections 2019, ఎస్పీ బీఎస్పీ పొత్తు, ఎస్పీ బీఎస్పీ సీట్ల పంపకం, ఎస్పీ-బీఎస్పీ, మాయావతి అఖిలేశ్, యూపీలో లోక్‌సభ స్థానాలు, సాధారణ ఎన్నికలు 2019
    మాయావతి, అఖిలేశ్ యాదవ్


    ప్రధాని అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్న మాయావతి.. పోటీకి దూరంగా ఉండబోతున్నారనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో  ఆసక్తికరంగా మారింది. అసలామె, ఎందుకీ నిర్ణయం తీసుకున్నారనే అంశంపై విశేషంగా చర్చ సాగుతోంది.  దాదాపు, రెండున్నర దశాబ్దాల తర్వాత ములాయం సింగ్ యాదవ్ పార్టీతో వేదిక పంచుకోబోతున్న మాయావతి.. తాను పోటీ చేసేందుకు అంబేడ్కర్‌ నగర్‌, నగీనా పార్లమెంటు స్థానాలను పరిశీలించారు. అయితే, ఆ తర్వాత తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి బలమైన కారణమే ఉన్నట్టు బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.

    madhya pradesh, rajasthan, madhya pradesh chhattisgarh, madhya pradesh elections, madhya pradesh election, madhya pradesh election result, madhya pradesh news, madhya pradesh exit polls, madhya pradesh exit poll, madhya pradesh opinion poll 2018, rajasthan elections, rajasthan election results, chhattisgarh and madhya pradesh, madhya pradesh elections results, madhya pradesh election results, చంద్రబాబు, చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఎన్సీ నేత ఫరూక్ అబ్దుల్లా, మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్, ప్రమాణ స్వీకారోత్సవానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, rajasthan, ashok gehlot rajasthan cm, rajasthan election result, rajasthan cm, rajasthan cm news, ashok gehlot cm rajasthan, 2018, chhattisgarh, chhattisgarh election 2018, chhattisgarh election, chhattisgarh assembly election 2018, mp chhattisgarh, chhattisgarh cm, inc chhattisgarh, etv chhattisgarh, chhattisgarh news, etv mp chhattisgarh, voting in chhattisgarh, new chhattisgarh cg song, outgoing chhattisgarh cm,chhattisgarh latest news,chhattisgarh congress cm,chhattisgarh chunav 2018,chhattisgarh election news,chhattisgarh chief minister, Ashok Gehlot in Rajasthan, Kamal Nath in MP, Baghel in Chhattisgarh, to be sworn in as Congress CMs today; Rahul Gandhi, Chandra Babu to attend all 3 ceremonies
    ఫైల్ ఫోటో: బీఎస్పీ అధినేత్రి మాయావతి


    ఏప్రిల్ 2న ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి ప్రచారం ప్రారంభించనున్న మాయావతి.. పార్టీ అధినేత్రిగా యూపీతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి.. ఒక స్థానానికే పరిమితం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నామని పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు, ఎస్పీ-బీఎస్పీ పొత్తు నేపథ్యంలో.. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థుల తరపున కూడా మాయావతి ప్రచారం చేయాల్సి ఉంది. అందుకే ఆమె పోటీకి దూరంగా ఉండి.. పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నట్టు తెలుస్తోంది. అంతిమంగా బీజేపీ హవాకు అడ్డుకోవడమే ఆమె టార్గెట్ అని బీఎస్పీ చెబుతోంది.

    bsp, janasena, mayawati, pawan kalyan, mayawati pawan kalyan, bsp janasean, bsp with janasena, ఏపీ ఎన్నికలు, ఏపీ పొలిటిక్స్, మాయావతి, ఉత్తర్ ప్రదేశ్, జనసేన, పవన్ కల్యాణ్, మాయావతితో పవన్ కల్యాణ్
    పవన్ కళ్యాణ్, మాయావతి (Image:Twitter)


    ఇక, ఇటీవలె పవన్ కల్యాణ్‌ లక్నోలో మాయావతిని కలిసి.. బీఎస్పీ, జనసేనల పొత్తు ఖరారు చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీ, జనసేన కలిసి పనిచేస్తాయని.. త్వరలోనే ప్రచారం చేస్తానని మాయావతి ప్రకటించారు.
    First published:

    Tags: Akhilesh Yadav, Bsp, Lok Sabha Election 2019, Mayawati, Sp-bsp, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు