AP Panchayat Elections: ఓటు కోసం చికెన్, మటన్, సిమెంట్.. పంచాయతీల్లో ప్రలోభాల పర్వం

(ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) తొలిదశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఏకగ్రీవాలు, నామినేషన్లలో గొడవలు.., బెదిరింపులు,దాడులు ఇలా నాటకీయ పరిణామాల మధ్య ఈనెల 9న పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఏకగ్రీవాలు, నామినేషన్లలో గొడవలు.., బెదిరింపులు,దాడులు ఇలా నాటకీయ పరిణామాల మధ్య ఈనెల 9న పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రచారానికి తెరపడటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు, మద్యంతో పాటు చికెన్, మటన్, బిర్యానీ ఇలా తమకు నచ్చిన, జనం మెచ్చిన రూపాల్లో ప్రలోభాలకు తెరతీస్తున్నారు. కొన్నిచోట్ల ఓటర్లకు ఏం అవసరాలున్నాయో తెలుసుకొని వాటిని తీరిస్తున్నారు. పోలింగ్ ముందు రోజు రాత్రి ఇంకెన్ని చిత్రాలు జరుగుతాయోనని ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

  పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు ఏ మాత్రం వెనక్కితగ్గడం లేదు. ప్రచారం ప్రారంభమైనప్పటి అభ్యర్థుల వెంటే తిరుగుతున్నవారికి నగదుతో పాటు మందు, బిర్యాని, నచ్చిన వస్తువులు కొనిపెట్టేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నాడు  పోటీలో నిలిచిన కొందరు అభ్యర్థులు  ఓటర్లకు చికెన్, మటన్ ఇలా సండే స్పెషల్ ఐటమ్స్ పంపిణీ చేసినట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో ఇప్పటికే నోట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనట్లు సమాచారం. జగ్గంపేట, కాకినాడ రూరల్, రంగంపేట, కోటనందూరు. తుని, పిఠాపురం, సామర్లకోట, గొల్లప్రోలు, కరప, పెదపూడి, తాళ్లరేవు, యు.కొత్తపల్లి, గండేపల్లి, కిర్లంపూడి, పెద్దాపురం మండలాల్లో నగదు పంపిణీ జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  ఇఖ శంఖవరం మండలంని ఓ గ్రామంలో ఓ పార్టీ అనుచరులు ఓటర్లకు ఇంటిసామాన్లు పింపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు ఎక్కువ ఓట్లుున్న కుటుంబాలకు టీవీలు, ఫ్రిడ్జ్, సౌండ్ సిస్టమ్స్ ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులతో వేస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గం, సామర్లకోట పరిధిలోని పలు పంచాయతీల్లో బోనస్ గా తమ ఎన్నికల గుర్తులకు సంబంధించిన సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పి.మల్లవరం గ్రామపంచాయతీలో నాలుగు కుటుంబాలు ఇంటి నిర్మాణం చేపట్టాయి. దీంతో వారి ఓట్లను దక్కించుకునేందుకు ఓ సర్పంచ్ అభ్యర్థి ఒక్కో కుటుంబానికి 30 సిమెంట్ బస్తాల చొప్పున ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

  సెంటిమెంట్ తో కొడుతున్నారు..
  కొన్ని గ్రామపంచాయతీల్లో భారీగా నగదు, మద్యం, మహిళలకు చీరలు, ఇతర వస్తువులతో గాలం వేస్తున్న అభ్యర్థులు.. వారితో ప్రమాణాలు కూడా చేయించుకుంటున్నారు. ఓట్ల కోసం డబ్బులిచ్చిన అనంతరం తమకే ఓటు వేయాలని దేవుడి పటాలపై ప్రమాణం చేయించుకుంటున్నారట. తాళ్లరేవు మండలంలోని కొన్ని గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. గొల్లప్రోలు మండలం, తాటిపర్తి అనే గ్రామ పంచాయతీలో ఓ వార్డు మెంబర్ ఇంటికి నాలుగువేలు చొప్పు పంచినట్లు తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published: