Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మళ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. మరోసారి ఎన్నికల (Elections) సందడి ప్రారంభమైంది. ఏపీ వ్యాప్తంగా 13 చోట్ల మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కు సంబంధించి ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ విడుదల చేసింది. నెల్లూరు కార్పొరేషన్ (Nellor corporation)తో పాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అలాగే 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటూ.. బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లిలో ఎన్నికలు జరుగుతాయి. గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాల్టీలకు ఎన్నికలు ఉన్నాయి. కోర్టు కేసులు, మరికొన్ని కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ ఎన్నికలు ఎన్నికల సంఘం తాజాగా కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్ని ఎన్నికల్లోనూ అధికార వైసీపీ (YCP) ఘన విజయాన్ని అందుకుంటోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపును అందుకుంది. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. టీడీపీ (TDP) ఈసారైనా పరువు నిలుపుకోవాలని చూస్తోంది.
నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది మార్చిలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో వివిధ కారణాలతో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు 32 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. అప్పట్లో ఎన్నికలు ఆగిన వాటిల్లో.. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మునిసిపాలిటీ, బుచ్చిరెడ్డిపాలెం(నెల్లూరు), ఆకివీడు(పశ్చిమగోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి(కృష్ణా), దాచేపల్లి, గురజాల(గుంటూరు), దర్శి(ప్రకాశం), బేతంచెర్ల(కర్నూలు), కమలాపురం, రాజంపేట(వైఎస్సార్), పెనుకొండ(అనంతపురం) మునిసిపాలిటీలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించనున్నారు..
ఇదీ చదవండి: ఉల్లాసంగా ఉత్సాహంగా ఉప రాష్ట్రపతి మార్నింగ్ వాక్.. ఈ వయసులో ఫిట్ నెస్ సీక్రెట్ అదే
మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ జారీ చేసిన మరుసటి రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టి.. 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవలే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల కమిషనర్లు కూడా టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
మునిసిపల్ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు 71 గ్రామాల్లో సర్పంచ్, 176 స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన మొత్తం మూడు స్థానాలకు నవంబరు 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో దేవశాని చిన్న గోవిందరెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీ కాలం 2021 మే 31న ముగియడంతో ఎన్నిక జరగనుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని మే 13, 2021న ఈసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నవంబరు 29న పోలింగ్ కు సిద్ధమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap mlc elections, AP News, AP Politics