బీజేపీకి మద్దతుగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఎన్నికల ప్రచారం

సుధాకర్ రెడ్డి తనకుమంచి మిత్రుడన్నారు. అందుకే ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చానన్నారు. అయితే తెలుగులోనే మాట్లాడారు బ్రహ్మానందం.

news18-telugu
Updated: December 1, 2019, 9:15 AM IST
బీజేపీకి మద్దతుగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఎన్నికల ప్రచారం
బ్రహ్మానందం ఫైల్ ఫోటో (brahmanandam)
  • Share this:
కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 5వతేదీన నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఎన్నికలకు మరో మూడురోజుల సమయమే ఉండటంతో... పార్టీలు ప్రచారాన్ని జోరు పెంచాయి.  ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్‌ అధినేత దేవెగౌడ చిక్క బళ్లాపురలో ప్రచారం నిర్వహించారు. ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం శనివారం చిక్కబళ్లాపురలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్‌ షో నిర్వహించారు. ఆయనను చూడడానికి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మానందం బీజీేపీ అభ్యర్థికి సుధాకర్‌కు అంతా ఓటేసి గెలిపించాలని కోరారు. సుధాకర్ రెడ్డి తనకుమంచి మిత్రుడన్నారు. అందుకే ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చానన్నారు. అయితే తెలుగులోనే మాట్లాడారు బ్రహ్మానందం. పలు తెలుగు సినిమా డైలాగ్స్ వేస్తూ...అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

ఉప ఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, జేడీఎస్‌ శ్రమిస్తున్నాయి. సీఎల్పీ నేత సిద్ధరామయ్య బెళగావి జిల్లా కాగవాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజుకాగె తరఫున ప్రచారం చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కాగవాడలో జేడీఎస్‌ అభ్యర్థి శ్రీశైలతుగశెట్టికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.

First published: December 1, 2019, 9:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading