HOME »NEWS »POLITICS »bowenpally kidanp case bhuma akhila priya released from jail chandrababu dials her sk

Bhuma Akhila Priya: జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల.. చంద్రబాబు ఫోన్

Bhuma Akhila Priya: జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల.. చంద్రబాబు ఫోన్
భూమా అఖిలప్రియ, చంద్రబాబు నాయుడు

Bowenpally kidanap case: అఖిల ప్రియ విడుదల కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యం ఉండాలని.. ఎన్ని కష్టాలు వచ్చినా మనోనిబ్బరంతో ముందుకెళ్లాలని చెప్పారు.

  • Share this:
    బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ 18 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి ఆమె బయటకు వచ్చారు. అఖిలప్రియ విడులవుతున్నారని తెలిసి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి అనుచరులు,కార్యకర్తలు హైదరాబాద్‌కు  భారీగా తరలివచ్చారు. వారి రాకతో జైలు పరిసరాల్లో సందడి నెలకొంది. ఇక అఖిల ప్రియ విడుదల కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని.. ఎన్ని కష్టాలు వచ్చినా మనోనిబ్బరంతో ముందుకెళ్లాలని చెప్పారు. తోటి వారికి కూడా ధైర్యం చెప్పాలని చంద్రబాబు సూచించారు.

    కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియకు శుక్రవారం సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 17 రోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్న అఖిలప్రియకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రూ. 10 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది.  మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.



    జనవరి 5న హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ప్రవీణ్ రావు సోదరులను భూమా అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్ చేశారు. ఈ కేసులో జనవరి 6న భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి రిమాండ్‌లోనే ఉన్నారు. కోర్టు 3 రోజుల పోలిస్ కస్టడీకి అప్పగించడంతో.. మూడు రోజుల పాటు ఆమె‌పై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. కిడ్నాప్ కేసుకు సంబంధించి కీలక వివరాలను రాబట్టారు. కిడ్నాప్‌కు ఎలా స్కెచ్‌ వేశారు? కిడ్నాప్‌లో పాల్గొన్న వారెవరు? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? నిందితులు ఎక్కడ ఉన్నారన్న దానిపై కూపీ లాగారు. అఖిలప్రియ ఇచ్చిన సమాచారంతో.. ఈ కేసులో ఇప్పటి వరకు అఖిలప్రియతో కలిపి మొత్తం 18 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌, గుంటూరు శ్రీను, జగన్‌విఖ్యాత్‌ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్‌ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఈ కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ ఏ1గా ఉన్నారు. ఆమె భర్త భార్గవరామ్‌, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, గుంటూరు శీను ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని పోలీసులు తేల్చారు. కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్స్‌లోనే కిడ్నాప్‌కు స్కెచ్‌ వేసినట్టు వెల్లడించారు. ఈ నెల 2, 4 తేదీల్లో అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, గుంటూరు శ్రీను కిడ్నాప్‌కు ప్లాన్‌ రూపొందించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ హఫీజ్‌పేట్‌లోని 48 ఎకరాల భూమి వ్యవహారంలో ప్రవీణ్ రావు ఫ్యామిలీకి, అఖిలప్రియ ఫ్యామిలీకి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రవీణ్ రావు సోదరులను అఖిల్ ప్రియ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published:January 23, 2021, 22:16 IST