ఆ పత్రికలో కథనంపై బొత్స సత్యనారాయణ ఘాటు లేఖ...

‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం: బొత్స’ అనే హెడ్‌లైన్‌తో ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనంపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: February 15, 2020, 5:40 PM IST
ఆ పత్రికలో కథనంపై బొత్స సత్యనారాయణ ఘాటు లేఖ...
బొత్స సత్యనారాయణ (File Photo)
  • Share this:
‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం: బొత్స’ అనే హెడ్‌లైన్‌తో ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనంపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను అనని మాటలను అనినట్టుగా తప్పుడు వార్తను రాశారన్నారు. ఈ మేరకు ఆయన ఓ ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితులమీద ఐటీ దాడుల్లో ఏకంగా వేల కోట్లు వెలుగు చూసిందంటున్న నేపథ్యంలో చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారించాలన్న డిమాండ్‌ మీద తాను మాట్లాడానని, అసలు విషయాన్ని వదిలేసి తాను అనని మాటలను హెడ్‌లైన్‌లో రాశారని ఆక్షేపించారు. ‘రాష్ట్ర ప్రయోజనాలు, ప్రధానంగా ఇక్కడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రయోజనాలు పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వం మాది. కేంద్రానికి–రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు ఉండాలని, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తెచ్చుకునేలా సంబంధాలు ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. అందులో భాగంగానే ప్రధానిని, హోం మంత్రిని, కేంద్రంలోని పెద్దలను ముఖ్యమంత్రి కలిశారనే విషయం ఎవరికైనా అర్థం అవుతుంది.’ అని లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, చంద్రబాబు ప్రయోజనాల కోసం కట్టుకథలు రాశారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు పర్సనల్‌ సెక్రెటరీ తీగ లాగుతుంటే కదులుతున్న వేల కోట్ల రూపాయల అవినీతి డొంకను ఎందుకు చూపించటం లేదని ప్రశ్నించారు.

బొత్స సత్యనారాయణపై ఈనాడు పత్రిక రాసిన కథనం


మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. కేంద్రంలోని ఎన్డీయేలో చేరాలంటూ వైసీపీని ప్రధాని మోదీ ఆహ్వానించినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈనెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం జగన్ కలిశారు. దీంతో బీజేపీ, వైసీపీ రెండూ జట్టుకట్టబోతున్నాయనే ప్రచారం బాగా జరిగింది.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు