కన్నబాబు ప్లేస్‌లో బొత్స చేతికి వ్యవసాయ బడ్జెట్

AP Assembly | వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు హఠాన్మరణం కారణంగా కన్నబాబు అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోతున్నారు.

news18-telugu
Updated: July 11, 2019, 8:13 PM IST
కన్నబాబు ప్లేస్‌లో బొత్స చేతికి వ్యవసాయ బడ్జెట్
బొత్స సత్యనారాయణ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు హఠాన్మరణం కారణంగా కన్నబాబు అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోతున్నారు. దీంతో కన్నబాబు స్థానంలో బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిప్రభుత్వం తొలిసారి పూర్తిస్తాయి బడ్జెట్‌ను రేపు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పద్దును సభలో ప్రవేశపెడతారు. సంక్షేమానికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేదిశగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. అయితే, కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పథకాల అమలు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...