ట్రంప్‌తో విందుకు జగన్‌ను అందుకే పిలవలేదేమో.. బొత్స కౌంటర్

దేశంలోనే వైఎస్ జగన్ బలమైన నేత అని అందుకే ఆయన్ను పిలవదేమోనని.. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: February 26, 2020, 3:22 PM IST
ట్రంప్‌తో విందుకు జగన్‌ను అందుకే పిలవలేదేమో.. బొత్స కౌంటర్
సీఎం జగన్, బొత్స సత్యనారాయణ
  • Share this:
రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ విందు కార్యక్రమానికి కొందరు ముఖ్యమంత్రులు మాత్రమే హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, హర్యానా సీఎం మనోహర్ ఖట్టర్, కర్నాటక సీఎం యడియూరప్ప, అసోం సీఎం సర్బానంద సోనోవాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐతే ఏపీ సీఎం జగన్‌కు ఆహ్వానం అందకపోవడంతో.. వైసీపీపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేతలు. జగన్‌పై కేసులున్నందుకే ఆహ్వానం అందలేదని సెటైర్లు వేశారు. ఈ క్రమంలో టీడీపీ విమర్శలను మంత్రి బొత్స సత్యనారాయణ తిప్పికొట్టారు. ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు సీఎం జగన్‌ను పిలవకపోవడంపై ఆయన స్పందించారు. దేశంలోనే వైఎస్ జగన్ బలమైన నేత అని అందుకే ఆయన్ను పిలవదేమోనని.. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

విశాఖలో మంత్రి బొత్స మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ''రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌తో విందుకు ఏపీ సీఎం జగన్‌తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు కూడా ఆహ్వానం అందలేదు. మొదటి సారి సీఎం అయినందుకే జగన్ పిలవలేదనుకుంటే.. రెండు మూడుసార్లు గెలిచిన వారిని ఎందుకు పిలవలేదు. సీనియర్ ముఖ్యమంత్రులకు ఎందుకు ఆహ్వానం అందలేదు. జగన్‌కు ఆహ్వానం అందలేదన్న అంశంపై విపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయి.'' అని అన్నారు.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు