కేంద్రం క్లారిటీ.. ఆ కమిటీ పాత్ర లేదు.. చంద్రబాబు మారాలన్న ఏపీ మంత్రి

Chandrababu Naidu: చంద్రబాబు జిమ్మిక్కులు అందరికీ తెలుసని...మోసం చేయడం చంద్రబాబుకు ఉన్న పేటెంట్ అని బొత్స మండిపడ్డారు.

news18-telugu
Updated: August 6, 2020, 1:42 PM IST
కేంద్రం క్లారిటీ.. ఆ కమిటీ పాత్ర లేదు.. చంద్రబాబు మారాలన్న ఏపీ మంత్రి
చంద్రబాబు
  • Share this:
రాష్ట్ర రాజధానితో సంబంధం లేదని కేంద్రమే చెప్పిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్రం అఫిడవిట్‌లో మూడు రాజధానులపై స్పష్టత ఇచ్చిందని.. ఇప్పటికైనా చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించడంలో శివరామకృష్ణణ్ కమిటీ పాత్ర లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందని అన్నారు. చంద్రబాబు మాటలు జనం నమ్ముతారంటే రాజీనామా చేయొచ్చని ఆయన అన్నారు. రాజీనామాలపై చంద్రబాబుది వితండవాదమని విమర్శించారు. ఏదైనా సమస్యపై పోరాటం చేయాలనుకుంటే రాజీనామా చేసి వెళ్లాలని సూచించారు. కానీ చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. 48 గంటల తరువాత వచ్చి ఏం చెప్పారో చంద్రబాబుకే తెలియదని ఎద్దేవా చేశారు.

Chandrababu naidu news, botsa satyanarayana news, ap news, Amaravati news, tdp news, ysrcp news, చంద్రబాబు న్యూస్, బొత్స సత్యనారాయణ న్యూస్, అమరావతి న్యూస్, టీడీపీ న్యూస్, వైసీపీ న్యూస్
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ(ఫైల్ ఫోటో)


చంద్రబాబు జిమ్మిక్కులు అందరికీ తెలుసని...మోసం చేయడం చంద్రబాబుకు ఉన్న పేటెంట్ అని బొత్స మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు విధ్వంసకారిలా మారారని.. తన స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని అన్నారు. తన ఐదేళ్ల కాలంలో చంద్రబాబు కనీసం అమరావతిలోని కరకట్టపై రోడ్డు కూడా వేయలేకపోయారని ఆరోపించారు. కన్సల్టెన్సీలకే వందల కోట్ల రూపాయలు కట్టబెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: August 6, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading