ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అలీ (ముస్లింలు), భజరంగ్ భళీ (హిందువులు) ఇద్దరూ తమ వైపే నిలుస్తారని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేస్ట్ చేసుకోవద్దని, ఎస్పీ - బీఎస్పీ కూటమికి వేయాలని పిలుపునిచ్చారు. మాయావతి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బెహన్జీ మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారంటూ బీజేపీ దుమ్మెత్తిపోసింది. బీఎస్పీ మునిగిపోయే పడవ అని అందుకే ఆమె మనుగడ కోసం ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించారు. అదే సమయంలో మాయావతి వ్యాఖ్యల తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీల పేరుతో ఓట్లు అడిగే వారిని భజరంగ్ భళీ వదిలిపెట్టడని అన్నారు. ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు మాయావతి కౌంటర్ ఇచ్చారు. అలీ, భజరంగ్ భళీ ఇద్దరూ తమవైపే ఉన్నారని చెప్పారు.
భజరంగ్ భళీ కూడా దళితుడే అంటూ సాక్షాత్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారని, కాబట్టి ఆయన కూడా తమ వైపే నిలుస్తారని మాయావతి అన్నారు. మా పూర్వీకుల గురించి తెలియజేసిన యోగి ఆదిత్యానాథ్కి కృతజ్ఞతలు కూడా చెప్పారు బెహన్ జీ.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.