3 రాజధానులకే మొగ్గు?.. బోస్టన్ కమిటీ నివేదికలోని అంశాలు ఇవేనా..

జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ కూడా బహుళ రాజధానులకే మొగ్గుచూపింది. అమరావతిలో సీఎం జగన్‌కు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ సమర్పించింది. ఆ నివేదికలో ఏపీ అభివృద్ధి, రాజధానిపై ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు.

news18-telugu
Updated: January 3, 2020, 6:35 PM IST
3 రాజధానులకే మొగ్గు?.. బోస్టన్ కమిటీ నివేదికలోని అంశాలు ఇవేనా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో మూడు రాజధానులే ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ కూడా బహుళ రాజధానులకే మొగ్గుచూపింది. అమరావతిలో సీఎం జగన్‌కు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ సమర్పించింది. ఆ నివేదికలో ఏపీ అభివృద్ధి, రాజధానిపై ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దేశంలో బహుళ రాజధానులున్న రాష్ట్రాలపై అధ్యయనం చేసిన బీసీజీ కమిటీ.. ఆయా రాష్ట్రాల అభివృద్ధిని నివేదికలో వివరించారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణను సైతం నివేదికలో ప్రస్తావించారు. అంతేకాదు అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాన్ని నివేదికలో సూచించింది బీసీజీ. ఏయే రంగాల్లో పెట్టబడులు పెట్టాలి.. వికేంద్రీకరణకు ప్రభుత్వం ఏం చేయాలన్న వివరాలను వివరించారు. అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితి వివరించారు. వ్యవసాయ, పర్యాటక, పరిశ్రమ, మత్స్య రంగాల అభివృద్ధిని నివేదిలో పేర్కొన్నారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలపై త్వరలో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది. అనంతరం జనవరి 20 తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మూడు రాజధానుల అంశంపై ప్రకటన చేసే అవకాశముంది.
Published by: Shiva Kumar Addula
First published: January 3, 2020, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading