శ్రీవారి ఆస్తుల విక్రయం వెనుక వైసీపీ ప్లాన్ ఇదే...బోండా ఉమా

తిరుమల శ్రీవారి ఆస్తులను చౌకగా కొట్టేయడానికి వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని టీడీపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు.

news18-telugu
Updated: May 23, 2020, 7:25 PM IST
శ్రీవారి ఆస్తుల విక్రయం వెనుక వైసీపీ ప్లాన్ ఇదే...బోండా ఉమా
తిరుమల ఆలయం
  • Share this:
తిరుమల శ్రీవారి ఆస్తులను చౌకగా కొట్టేయడానికి వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని టీడీపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. తమిళనాడులోని ఆస్తులను విక్రయించాల్సిన అవసరం టీటీడీకి ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇలా చేస్తే ఎవరైనా భక్తులు శ్రీవారికి కానుకలు ఇస్తారా? అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను ప్రస్తుత సీఎం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రులు సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేవారని, జగన్ మాత్రం ఒక్కరే వెళ్లి ఇస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ పోటులో తవ్విన వేల కోట్ల డైమండ్లు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని ఆరోపించిన వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గతంలో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయాలు తీసుకునే వారన్న బోండా ఉమా... ఇప్పుడు తాడేపల్లిలో చర్చించి టీటీడీ బోర్డులో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఏడు కొండలను, వెంకన్నను అవమానించిన వాళ్లు ఏమయ్యారో అందరికీ తెలుసు అని బోండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వామి వారి ఆస్తులు పరిరక్షించే విధంగా జగన్ నిర్ణయం తీసుకోవాలని, ఆస్తులు అమ్మకాల నిర్ణయం ఉపసంహరించుకోవాలని, లేదంటే టీడీపీ పోరాటం చేస్తుందని బోండా ఉమ హెచ్చరించారు.

తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వీటి విలువ కోటి 50 లక్షల రూపాయలుగా గుర్తించిన టీడీపీ...టెండర్ల ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 30న కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం గతంలోనే టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేశారు. నిరర్థకమైన ఆస్తుల విక్రయాల ద్వారా రూ. 100 కోట్లు సమకూర్చుకోవాలని భావించిన టీటీడీ... 2020-21 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా ఆమోదించింది.

First published: May 23, 2020, 7:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading