BOMB BLAST IN WEST BENGAL MUNICIPAL ELECTIONS AND OPPOSITION BJP LEADER SUVENDHU ADHIKARI PROTESTED AT THE ELECTION COMMISSION OFFICE DEMANDING A RE POLL PRV
West Bengal: బెంగాల్ మునిసిపల్ ఎన్నికల్లో బాంబు దాడి.. రీ పోలింగ్ నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్ ఆఫీసులో కూర్చుని ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు నిరసన
ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కూర్చున్న సువేందు అధికారి (Photo: ANI/twitter)
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘర్షణల్లో పలువురు చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. అయితే బెంగాల్లో మళ్లీ ఎన్నికల హింస చెలరేగింది.
పశ్చిమ బెంగాల్ (west Bengal). చాలా రోజులుగా దేశంలో వినిపిస్తున్న పేరు. ఇటీవల ఎన్నికల్లో మోదీ హవాను తట్టుకొని గెలిచారు మమతా బెనర్జీ (Mamatha Banerjee). టీఎంసీని విజయపథంలో నిలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘర్షణల్లో పలువురు చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. అయితే బెంగాల్లో మళ్లీ ఎన్నికల హింస (Violence) చెలరేగింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (Kolkata Municipal Corporation) ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలువార్డుల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బెలఘట్టా పోలింగ్ బూత్ (Polling booth) దగ్గర బాంబు దాడి (Bomb blast) జరగడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రాణభయంతో ఓటర్లు పరుగులు పెట్టారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (Kolkata Municipal Corporation) లోని 144 వార్డులకు పోలింగ్ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కొన్ని ప్రాంతాల్లో తమ అభ్యర్ధులపై దాడులు (Attacks on their candidates) జరిగాయని బీజేపీ ఆరోపించింది. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. టీఎంసీ కార్యకర్తల రిగ్గింగ్‌ను అడ్డుకోలేదని కూడా విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ (TMC) నేతలు ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Banerjee) కూడా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. త్రిపురలా కాకుండా కోల్‌కతాలో మున్సిపల్ కార్పొరేషన్ (Kolkata Municipal Corporation_ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని దీదీ అన్నారు .
76 మంది అరెస్ట్..
2010 , 2015 మున్సిపల్ ఎన్నికల్లో కూడా తృణమూల్ గెలిచింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషషన్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టీఎంసీ (TMC) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసం 23 వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. పలుచోట్ల తృణమూల్ , బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు (Police) లాఠీఛార్జ్ చేశారు. ఈనెల 21వ తేదీన కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. పోలింగ్ సందర్భంగా 76 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే టీఎంసీ ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది.
West Bengal | LoP Suvendu Adhikari with BJP delegation hold a sit-in strike inside the State Election Commissioner Office, demanding repolling for today's KMC election pic.twitter.com/VJEjgMbUEo
మరోవైపు ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కార్యాలయంలో భైఠాయించారు. రీపోలింగ్ నిర్వహించాలంటూ నిరసన వ్యక్తం చేశారు.
It is disappointing that Mamata Banerjee is using police to manhandle senior BJP leader, LoP @SuvenduWB while he was visiting the State Election Commission. Reports of widespread electoral malpractice in KMC and now this misuse of administration doesn’t augur well for democracy.
మరోవైపు బెంగాల్లో పరిస్థితులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సందర్శించిన సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత సువెందు అధికారిపై మమతా బెనర్జీ పోలీసులను ఉపయోగించుకోవడం నిరాశపరిచిందని అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో గొడవలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయని, అంతేకాకుండా అధికార దుర్వినియోగం కూడా చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని జేపీ మండిపడ్డారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.