Home /News /politics /

BLOW TO BJP AHEAD OF POLLS AS UP MINISTER SWAMI PRASAD MAURYA JOINS IN SP AKHILESH YADAV MKS

UP Election 2022: బీజేపీకి భారీ షాక్ -మంత్రి పదవికి మౌర్య రాజీనామా.. ఆ వెంటనే..

బీజేపీ మంత్రి పదవికి రాజీనామా తర్వాత ఎస్పీ చీఫ్ అఖిలేశ్ తో స్వామి ప్రసాద్ మౌర్య

బీజేపీ మంత్రి పదవికి రాజీనామా తర్వాత ఎస్పీ చీఫ్ అఖిలేశ్ తో స్వామి ప్రసాద్ మౌర్య

ఉత్తరప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాకిస్తూ మంత్రి కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, నిరుద్యోగ యువతను యోగి సర్కార్ మోసం చేసిన కారణంగా బీజేపీని వీడుతున్నట్లు చెప్పారు..

ఇంకా చదవండి ...
డబుల్ ఇంజన్ సర్కార్ దూకుడు అంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోన్న అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. యోగి కేబినెట్ సహచరుడు, యూపీ కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం నాడు పదవికి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఆయన.. బీజేపీపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన కాసేపటికే మౌర్య నేరుగా అఖిలేశ్ యాదవ్ ఇంటికెళ్లి సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరిపోయారు. ఈ మేరకు లక్నోలో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఉత్తరప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాకిస్తూ మంత్రి కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్నతరహా పరిశ్రమలపై యూపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేసినట్టు మౌర్య తెలిపారు.

UP Election 2022: మాయావతి ఎక్కడ? పోటీకి దూరంగా BSP అధినేత్రి



కాగా, మౌర్య రాజీనామాపై బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మరో అదనపు సీటు కావాలని మౌర్య డిమాండ్ చేశారని, అందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతోనే ఆయన రాజీనామా చేశారని కమలనాథులు చెబుతున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేశాక ఎస్పీ చీఫ్ అఖిలేశ్ ఓ ఫోటోను షేర్ చేశారు..

Pig Heart In Human: వైద్య చరిత్రలో అద్భుతం: మనిషికి పంది గుండె అమర్చిన డాక్టర్లు


యూపీలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటం జరుపుతున్న పాపులర్ నేత స్వామి ప్రసాద్ మౌర్య, అతని సహచరులకు స్వాగతం పలుకుతున్నట్టు అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వస్తాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Akhilesh Yadav, Assembly Election 2022, Bjp, Samajwadi Party, Uttar Pradesh Assembly Elections

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు